Hin

9th sep 2024 soul sustenance telugu

September 9, 2024

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము. మనస్సు తికమక పడుతున్నప్పుడు, అది అనిశ్చితత, చికాకు, ఆందోళన మరియు భయాన్ని సృష్టిస్తుంది. మనం ముందుకు సాగడానికి కష్టపడుతూ నమ్మకాన్ని కోల్పోతాము. శాంతి మరియు స్థిరత్వం యొక్క జీవితానికి స్పష్టత చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు మన మనస్సు అయోమయానికి గురవుతుంది. ఈ ఉద్రేకపూరిత ఆంతరిక స్థితిలో, మనస్సు చాలా ఆలోచనలను సృష్టిస్తుంది, బుద్ధి వాటిని సజావుగా ప్రాసెస్ చేయదు. కాబట్టి సరైన నిర్ణయాలు లేదా సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి మనం  కష్టపడుతాము.

స్పష్టత కొరకు ఈ విధానాలను  అనుసరించండి –

  1. ఒకే మానసిక స్థితిలో ఆలోచించడంతో గందరగోళాన్ని తొలగించలేము. మీరు ప్రశాంతంగా ఉండి ఉన్నతమైన ఆలోచనలను చేయాలి.
  2. ప్రతిరోజూ ఉదయం కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనస్సును ఎమోషనల్ టాక్సిన్స్ నుండి శుభ్రపరిచి దానిని నిశ్శబ్దం చేస్తుంది. మీ అంతర్ దృష్టి లేదా వివేకం సక్రియం అవుతుంది.
  3. మీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు, మీ ప్రశ్నను వేసి సమాధానాల కోసం వేచి ఉండండి. తప్పకుండా సరైన సమాధానాలు వెంటనే లేదా తర్వాత వస్తాయి.
  4. నమ్మకాలు, నిర్ణయాలు, కెరీర్ లేదా సంబంధాలలో గందరగోళం ఉన్నా, పరిష్కారం మీలోనే ఉంటుంది. మీరు ఇతరుల నుండి సలహా తీసుకున్నప్పటికీ, మీ అంతర్ దృష్టి ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి.

పరిస్థితిని నియంత్రించడంలో, సరైన ప్రతిస్పందనలను ఎంచుకోవడంలో స్పష్టత మీకు సహాయపడుతుంది. మనం స్పష్టత వైపు ఎలా మారతామో గట్టి సంకల్పాన్ని చేద్దాం –

నేను తెలివైన వ్యక్తిని … నా ప్రతి ఆలోచన సరైనదే … నేను ప్రతి ఉదయం నా మనస్సును ఉత్తేజపరుస్తాను … నేను ప్రతిరోజూ 15 నిమిషాలు ధ్యానం చేస్తాను … నేను నా అంతర్ దృష్టిని బలోపేతం చేస్తాను … నేను నా ప్రతిస్పందనను ఎంచుకుంటాను … నాకు ఏది సరైనదో నేను నిర్ణయించుకుంటాను … ప్రతి నిర్ణయం నా విలువలపై ఆధారపడి ఉంటుంది. … నా అంతర్ దృష్టి నాకు సరైన సమాధానం ఇస్తుంది … నా ప్రతి నిర్ణయం ఖచ్చితమైనది … నేను సరైనది ఆలోచిస్తాను … నేను తక్కువ ఆలోచిస్తాను … నేను శక్తివంతుడిని.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »