Hin

8th sep 2024 soul sustenance telugu

September 8, 2024

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

  1. శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు.
  2. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు, ఒక చేయ్యి దీవెనలు ఇస్తోంది. గొడ్డలి నెగిటివ్ అలవాట్లను తగ్గించే శక్తిని సూచిస్తుంది. తాడు అనేది స్వచ్ఛమైన జీవనశైలి యొక్క క్రమశిక్షణతో ముడిపడి ఉండటానికి ప్రతీక. కమల పుష్పం వంటి జీవితం అంటే బురదతో నిండిన పరిసరాలలో జీవిస్తూ అంటీ ముట్టనట్టుగా, స్వచ్ఛంగా ఉండటం. వరద హస్తం అంటే ఇతరులు ఎలా ప్రవర్తించినా, మన ఆలోచనలు మరియు మాటలు వారికి కేవలం ఆశీర్వాదం గానే ఉండాలి.
  3. వారి ఒక కాలు నేలను తాకినట్లు మరియు మరొకటి మడిచి కూర్చున్నట్లు చూపిస్తారు. స్థిరంగా మరియు నిరాడంబరంగా ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచంలో ఉంటూ అతీతంగా ఉండాలి.
  4. వారి ఒక చేతిలో ఉంచబడిన మోదకం కృషికి ఫలితమైన విజయాన్ని సూచిస్తుంది. కానీ వారు దానిని తినడం ఎప్పుడూ చూపించలేదు, అంటే విజయం సాధించాలి కానీ దానికి ఘనతను తీసుకోవద్దు. మోదకం తయారు చేయడానికి మొత్తం 5 వేళ్ళు అవసరం, అది ఐక్యత మరియు సహకారాన్ని సూచిస్తుంది.
  5. శ్రీ గణేషుని పాదాలకు దగ్గరగా చూపించిన ఎలుక దుర్గుణాలు, కోరికలపై విజయాన్ని సూచిస్తుంది. ఒక చిన్న రంధ్రం ద్వారా కూడా ఎలుక నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు, అప్రమత్తంగా లేని ఆత్మలోకి దుర్గుణాలు ప్రవేశిస్తాయి. శ్రీ గణేషుని లక్షణాలన్నింటినీ మనం గ్రహించినప్పుడు, మన దుర్గుణాలను మరియు కోరికలను అధిగమిస్తాము.

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో శ్రీ గణేశుడు సూచించిన దైవీ లక్షణాలను మనం అనుభవం చేసుకోవటం, వ్యక్తపరచడం ప్రారంభించినప్పుడు, మన ఆటంకాలు నాశనం అవుతాయి.  మన జీవితంలో అడుగడుగునా స్వచ్ఛత, శాంతి మరియు శ్రేయస్సును అనుభవం చేసుకుంటాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరులను క్షమించడం మనకు కష్టమవుతుంది. క్షమాపణ మాత్రమే ప్రతికూలతను కరిగించడానికి సహాయపడుతుందని మనం గుర్తుంచుకుంటే, అది జీవితంలో

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »