Hin

19th feb 2024 soul sustenance telugu

February 19, 2024

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా? తరచూ మనం గతంలోకి వెళ్ళి దృశ్యాలను రివైండ్ చేసినప్పుడు, ఇలా అయితే, ఇలా కాకపోతే అని అనుకుంటాము… స్వయం గురించి, ఇతరుల గురించి నిరర్థకమైన ఆలోచనలు చేస్తుంటాము – నేనిలా ఎందుకు చేసాను? లేక అతడు నాకు సహాయం చేసుండాల్సింది, కానీ ఎందుకు చేయలేదు? తను నా సలహా తీసుకుని ఉండాల్సింది. ఈ విధంగా గతంలో కలిగిన బాధను మళ్ళీ అనుభవిస్తూ ఉండటం వలన మన సంతోషం, ఆరోగ్యం క్షీణిస్తాయి. ఇలాంటప్పుడు మనం దేనినీ నేర్చుకోలేము. నేను మారాలి అనడానికి బదులు వారు దోషి అంటున్నాము, తీర్పులు ఇస్తుంటాము, దోషిగా చేసే ఆటను ఆరంభిస్తాము. గతం నుండి నేర్చుకోవడం అంటే మునుపు ఎలా స్పందించాను, భవిష్యత్తులో అటువంటి పరిస్థితి వస్తే సరైన విధంగా ఎలా స్పందించాలో అవగాహన పెంచుకోవడం.

ఒక్క నిమిషం ఆగి, ఒక సంఘటన గురించి చేదుగా మునుపటిలా కాక ఇప్పుడు పాజిటివ్‌గా ఎలా స్పందించాలో ఆలోచించండి –

ధృవీకరణ-

నేను జ్ఞాన స్వరూప ఆత్మను… నేను ఎప్పుడూ నా యోగ్యతను గౌరవిస్తాను, స్వయాన్ని అంగీకరిస్తాను… కొన్నిసార్లు నేను నా సహోద్యోగి గురించి సరిగ్గా ఆలోచించని సందర్భాలు ఉన్నాయి… కుటుంబ సభ్యులతో కోపంగా స్పందించాను… వ్యాపారంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాను… వాటి బాధ్యతను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను… ఎటువంటి అపరాధ భావం మనసులో పెట్టుకోను… ఆ తప్పులు చేసినందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను… సంఘటన కారణంగా నాలో నిల్వ అయిన ప్రతికూల భావాలను విడుదల చేస్తున్నాను… నిరంతర అభ్యాసకుడిగా ఉన్న నేను… ఇప్పుడు, జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తున్నాను, కేవలం నన్ను మరింత మెరుగుపరుచుకోవడానికే ఆలోచిస్తున్నాను… అంతేగానీ ఫలానావారు ఎలా ఉండి ఉండాల్సింది అని నేను ఆలోచించడం లేదు… ఆ సమయంలో నేను ఎలా ఆలోచించాల్సింది, ఎలా మాట్లాడాల్సింది, ఎలా ప్రవర్తించాల్సింది అని నా మానసపటలంపై ఊహించుకుంటున్నాను… నా స్క్రిప్ట్ పై నేను పూర్తి శ్రద్ధ వహిస్తున్నాను… నేను గతం నుండి పాఠం నేర్చుకుని సానుకూలంగా ముందుకు అడుగులు వేయాలనుకుంటున్నాను, స్వయాన్ని మరియు ఇతరులను క్షమించాలనుకుంటున్నాను… స్వ పరివర్తన దిశగా నా మనసును తీసుకువెళ్ళి మరుసటి సారి సానుకూలంగా స్పందించేలా మనసును సంసిద్ధం చేస్తున్నాను… నిన్నటి పొరపాట్లు ఈరోజు జరగకుండా జాగ్రత్తపడతాను… నేను వర్తమానంలోకి వస్తున్నాను… గతంలో ఎవరైనా నాతో సరిగ్గా వ్యవహరించకపోయినా కానీ వర్తమానంలో నేను వారిని దూరం పెట్టను… నేను కేవలం గతంలో వచ్చిన ప్రతికూల స్పందనలను దూరం పెడతాను… వారి గురించిగానీ, నా గురించి గానీ ఏవైనా ప్రతికూల భావాలుంటే నేను వాటిని విడుదల చేస్తున్నాను… అడ్జస్ట్ అయ్యే నా సుగుణాన్ని పెంచుకుని సర్దుకుపోతాను… నేను ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, మెరుగుపడాలని చూస్తాను…

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th july 2024 soul sustenance telugu

ప్రశంసల కోరిక నుండి విముక్తి పొందడం (పార్ట్ 3)

మనందరికీ వేర్వేరు స్వభావాలు లేదా వ్యక్తిత్వాలు ఉంటాయి. జన్మ, పునర్జన్మల కథలో మన ప్రయాణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ఈ సమయంలో, మనమందరం వివిధ రకాలుగా విజయాన్ని పొందుతాము. వ్యక్తులతో ప్రేమగా వ్యవహరించడంలో

Read More »
23rd july 2024 soul sustenance telugu

ప్రశంసల కోరిక నుండి విముక్తి పొందడం (పార్ట్ 2)

మన రోజువారీ జీవితంలో, మనలో కొందరు అనుభవం చేసుకునే  చాలా సాధారణ భావన ఏమిటంటే మనం చేసిన పనికి ప్రశంసలు పొందాలనే కోరిక. మీ కోసం, మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం అలాగే

Read More »
22nd july 2024 soul sustenance telugu

ప్రశంసల కోరిక నుండి విముక్తి పొందడం (పార్ట్ 1)

మన రోజువారీ జీవితంలో, మనలో కొందరు అనుభవం చేసుకునే  చాలా సాధారణ భావన ఏమిటంటే మనం చేసిన పనికి ప్రశంసలు పొందాలనే కోరిక. మీ కోసం, మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం అలాగే

Read More »