Hin

5th oct 2023 soul sustenance telugu

October 5, 2023

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా వింటామో, చదివుతామో, అవలంభిస్తామో  అంత మన నెగిటివ్ జ్ఞాపకాలు కరిగిపోతాయి. అలాగే, జ్ఞానాన్ని రెగ్యులర్ గా తీసుకున్నట్లైతే, మన మనస్థితి ఉన్నత స్థాయికి చేరుకొని ఆధ్యాత్మిక ఆనందం యొక్క అనుభవాన్ని ఇస్తుంది.  దీనిలో మన గత బాధలు, నెగిటివ్ అనుభవాల జ్ఞాపకాలు కనుమరుగై పోతాయి. భౌతిక స్థాయిలో కూడా, కొందరు వ్యక్తులు వారి జీవితంలోని నెగిటివిటీని మర్చిపోవడానికి ఏదో ఒక రకమైన నెగిటివ్ వ్యసనం లేదా నషాలో మునిగిపోతారు.  ఎందుకంటే అది తాత్కాలికంగా వారికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞాన నషా అనేది పాజిటివ్ మరియు స్వచ్ఛమైన నషా, ఇది మన జీవితంలోని నెగిటివ్ గతాన్ని శాశ్వతంగా మరచిపోవడానికి సహాయపడుతుంది.

కర్మ సాక్షాత్కారం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఇది కర్మ సిద్ధాంతం యొక్క వివిధ సూత్రాలు , ప్రపంచ నాటకంలో దానిని ఎలా ఉపయోగించాలో మనం గ్రహించేలా చేస్తుంది. ఇది గతాన్ని వదిలేయడంలో మరియు మన వర్తమానంపై దృష్టి పెట్టడంలో, గతం యొక్క క్వాలిటి తో సంబంధం లేకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవటంలో మనకు చాలా సహాయపడుతుంది. 

స్వ మరియు భగవంతుని సాక్షాత్కారం – మెడిటేషన్ ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన అంశం. మెడిటేషన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి, స్వ అనగా ఆత్మ మరియు ఆత్మిక తండ్రి అయిన పరమాత్మ లేదా భగవంతుడిని యదార్ధ పరిచయం మరియు అనుభూతి. దీనిలో గతం గురించి పశ్చాత్తాపానికి చోటు లేకుండా గతం నుండి విముక్తి యొక్క అనుభవం ఇస్తుంది. భౌతికమైన వాటికి లేదా దేహాభిమానానికి సంబంధించిన తప్పుడు భావోద్వేగాల పట్ల మోహానికి, వాటి వల్ల తనకు జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుంటూ  దుఃఖాన్ని అనుభవించడం, ఇవన్నీ  గత పశ్చాత్తాపాలను ప్రతిబింబిస్తాయి. 

కనెక్షన్ మరియు సంబంధం –  నాకు మరియు భగవంతుని లేదా పరమ పితకు మధ్య లోతైన సంబంధాన్ని కలిగి ఉండటమే మెడిటేషన్, ఇది నాలో అపారమైన శక్తిని నింపుతుంది. ఇది నాకు శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని నింపే లోతైన సంబంధం కూడా.కొంత కాలం పాటు ఈ ప్రాప్తుల అనుభవం నా గతం యొక్క భారాన్ని నా అంతరాత్మ  పై మోపడం ఆగిపోతుంది.

(రేపు కొనసాగుతుంది…) 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »
26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »