Hin

6th oct 2023 soul sustenance telugu

October 6, 2023

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు . గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై చాలా లోతైన నెగిటివ్ ప్రభావాలను లేదా మచ్చలను వేస్తాయి, ఇది కొన్నిసార్లు నయం కావడానికి చాలా సమయం పడుతుంది మరియు కొన్నిసార్లు అవి నయం కాకుండానే మొత్తం జన్మను గడపుతూ ఉండవచ్చు. గత నెగిటివ్ అనుభవ ముద్రలు మరియు కోపం, ద్వేషం, భయం, నొప్పి, అపరాధం మొదలైన నెగిటివ్ భావోద్వేగాలు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి, స్వయాన్ని సరిదిద్దుకోవడం లేదా పాజిటివ్ సంస్కారాలను చేర్చుకోవడం స్వయాన్ని పాజిటివ్ ముద్రలతో నింపుతుంది. ఇది, కొంత కాలంలో, ఈ నెగిటివ్ ముద్రల ప్రభావాన్ని మరియు దాని ఫలితంగా, సంబంధిత నెగిటివ్ జ్ఞాపకాలను నిర్వీర్యం చేస్తుంది.

దానం – దానం అంటే స్వపరివర్తన ద్వారా అనుభవం చేసుకున్న గుప్త ప్రాప్తులను ఇతరులకు అందించడం. ఇది మనం దానం ఇచ్చిన వారి నుండి ఆశీర్వాదాలు లేదా పాజిటివ్ శక్తిని పొందడంలో సహాయపడుతుంది. మన జీవితానికి పాజిటివ్ ప్రయోజనాన్ని ఇస్తుంది, ఈ రెండూ మన గతాన్ని మరచిపోవడానికి చాలా సహాయపడతాయి. ఇతరుల కోసం ఎక్కువ సమయం వెచ్చించే వారితో పోలిస్తే తమ కోసం మాత్రమే జీవించే వ్యక్తులు తమ గతాన్ని మర్చిపోవడం చాలా కష్టం. ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడం వల్ల మన దుఃఖాన్ని మరచిపోగలం.

సంకర్షణ – మనం ఎంత ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల సాంగత్యంలో ఉంటూ,  పలకరిస్తూ, వారితో పాజిటివ్ సంభాషణలను చేస్తూ ఉంటామో, మనం అంత పాజిటివ్ శక్తిని అందిస్తాము, పొందుతాము. అంతేకాక మన గతం మన మనసులో నుండి అంత ఎక్కువగా తుడిచివేయబడుతుంది. 

ఆధ్యాత్మికత మనకు అంతరంగంలో చూసుకుంటూ అంతర్ముఖతను అనుభవం చేయటం నేర్పుతుంది. అదే సమయంలో, ఆధ్యాత్మికత అంతర్ముఖత మరియు బాహ్యముఖత మధ్య సమతుల్యతను కాపాడుకోవడం కూడా బోధిస్తుంది. స్థిరమైన మరియు సమతుల్యమైన అంతర్ముఖత, బాహ్యముఖత, సద్గుణాలు కలవారితో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సంబంధాలు మనల్ని ఎక్కువగా వర్తమానం లోనే ఉంచడంలో సహాయపడతాయి, మనస్సును గతంలోకి ఎక్కువగా వెళ్లనివ్వవు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th sep 2024 soul sustenance telugu

మన ప్రకంపనల నాణ్యత మరియు అవి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి

మనం సృష్టించే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి పదం మరియు మనం చేసే ప్రతి చర్య విశ్వంలోకి భౌతికం కాని శక్తి లేదా ప్రకంపనల రేడియేషన్కు,ఇతర వ్యక్తుల వైపు, పరిసరాల వైపు, వాతావరణానికి,

Read More »
17th sep 2024 soul sustenance telugu

ఇతరులను అనుమానించడం ఆపండి, వారిని నమ్మడం ప్రారంభించండి

మనలో కొంతమందికి మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి గురించి మనకున్న సందేహాలు వారితో కంటే కూడా మన అలవాటులతో ఎక్కువ సంబంధించబడి ఉంటాయి. మన అనారోగ్యకరమైన సందేహాలు,

Read More »
16th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 3)

మనం మన జీవితంలో ఎక్కువ భాగం మన ప్రత్యేకతలు, వ్యక్తిత్వం లేదా పాత్రతో అనుబంధం కొనసాగిస్తే, కాలక్రమేణా మనం గుర్తించబడటానికి వేచి ఉన్న నిజమైన స్వభావాన్ని మరచిపోతాము. పైన పేర్కొన్నవాటిలో నేను ఒకడిని, అని

Read More »