Hin

6th july 2025 soul sustenance telugu

July 6, 2025

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా వింటామో, చదివుతామో, అవలంభిస్తామో అంత మన నెగిటివ్ జ్ఞాపకాలు కరిగిపోతాయి. అలాగే, జ్ఞానాన్ని రెగ్యులర్ గా తీసుకున్నట్లైతే, మన మనస్థితి ఉన్నత స్థాయికి చేరుకొని ఆధ్యాత్మిక ఆనందం యొక్క అనుభవాన్ని ఇస్తుంది. దీనిలో మన గత బాధలు, నెగిటివ్ అనుభవాల జ్ఞాపకాలు కనుమరుగై పోతాయి. భౌతిక స్థాయిలో కూడా, కొందరు వ్యక్తులు వారి జీవితంలోని నెగిటివిటీని మర్చిపోవడానికి ఏదో ఒక రకమైన నెగిటివ్ వ్యసనం లేదా నషాలో మునిగిపోతారు.  ఎందుకంటే అది తాత్కాలికంగా వారికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞాన నషా అనేది పాజిటివ్ మరియు స్వచ్ఛమైన నషా, ఇది మన జీవితంలోని నెగిటివ్ గతాన్ని శాశ్వతంగా మరచిపోవడానికి సహాయపడుతుంది.

కర్మ సాక్షాత్కారం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఇది కర్మ సిద్ధాంతం యొక్క వివిధ సూత్రాలు, ప్రపంచ నాటకంలో దానిని ఎలా ఉపయోగించాలో మనం గ్రహించేలా చేస్తుంది. ఇది గతాన్ని వదిలేయడంలో మరియు మన వర్తమానంపై దృష్టి పెట్టడంలో, గతం యొక్క క్వాలిటి తో సంబంధం లేకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవటంలో మనకు చాలా సహాయపడుతుంది. 

స్వ మరియు భగవంతుని సాక్షాత్కారం – మెడిటేషన్ ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన అంశం. మెడిటేషన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి, స్వ అనగా ఆత్మ మరియు ఆత్మిక తండ్రి అయిన పరమాత్మ లేదా భగవంతుడిని యదార్ధ పరిచయం మరియు అనుభూతి. దీనిలో గతం గురించి పశ్చాత్తాపానికి చోటు లేకుండా గతం నుండి విముక్తి యొక్క అనుభవం ఇస్తుంది. భౌతికమైన వాటికి లేదా దేహాభిమానానికి సంబంధించిన తప్పుడు భావోద్వేగాల పట్ల మోహానికి, వాటి వల్ల తనకు జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుంటూ దుఃఖాన్ని అనుభవించడం, ఇవన్నీ గత పశ్చాత్తాపాలను ప్రతిబింబిస్తాయి. 

కనెక్షన్ మరియు సంబంధం – నాకు మరియు భగవంతుని లేదా పరమ పితకు మధ్య లోతైన సంబంధాన్ని కలిగి ఉండటమే మెడిటేషన్, ఇది నాలో అపారమైన శక్తిని నింపుతుంది. ఇది నాకు శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని నింపే లోతైన సంబంధం కూడా. కొంత కాలం పాటు ఈ ప్రాప్తుల అనుభవం నా గతం యొక్క భారాన్ని నా అంతరాత్మ  పై మోపడం ఆగిపోతుంది.

(సశేషం…) 

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »