4th Oct 2023 Soul Sustenance Telugu

October 4, 2023

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 1)

మనలో చాలా మంది గతంలో మన జీవితంలో జరిగిన నెగిటివ్ సంఘటనలు మరియు సంఘటనల యొక్క భారీ లేదా సూక్ష్మమైన భారాన్ని మోస్తారు, ఇది ఈ మధ్యనే జరిగిన  గతం లేదా చాలా కాలం క్రితం కావచ్చు; ఇది మన ప్రస్తుత సంతృప్తి స్థాయిలను బాగా తగ్గిస్తుంది. నెగిటివ్ గతం ఏ రూపంలోనైనా ఉండవచ్చు – మీరు ప్రియమైన వ్యక్తిని ఆకస్మిక మరణం లేదా ముగిసిన సంబంధంలో కారణంగా మీరు దగ్గర వారిని కోల్పోవడాన్ని మీరు అనుభవించారు; మీరు తీవ్రమైన శారీరక అనారోగ్యం లేదా ఆర్థిక నష్టం యొక్క చాలా కష్టమైన దశని దాటారు, మీరు మానసిక లేదా శారీరక స్థాయిలో నిందలకు గురయ్యారు; కార్యాలయంలోని సహోద్యోగి మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు మరియు మీ నుండి అనవసర ప్రయోజనం పొందారు; మీరు అనుచితమైన చర్య చేసారు మరియు చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మీరు ఇప్పటి వరకు పశ్చాత్తాపపడ్డారు మరియు ఇలాంటి అనేక రకాల సంఘటనలు జరిగి ఉండవచ్చు.

మన మనసులో నుండి నెగిటివ్ గత జ్ఞాపకాలను తొలగించడానికి మూడు విభిన్న రకాల ప్రక్రియలు ఉన్నాయి: 

మార్చుకోవటం – గత నెగిటివ్ సంఘటనను పాజిటివ్, ప్రయోజనకరమైన రూపంలోకి మార్చుకొని మనసులో నిలుపుకోవటం.

మర్చిపోవడం – గత నెగిటివ్ సంఘటన యొక్క జ్ఞాపకాలు మన సంభాషణలలో లేదా మన చేతన మనస్సు లేదా ఆలోచనలలో ఉండని విధంగా మరచిపోవాలి, అయినప్పటికీ ఆ జ్ఞాపకాల ఆనవాలు అంతః చేతన మనస్సులో ఉంటాయి. 

 

తుడిచివేయటం – మనసులో గతం యొక్క నెగిటివ్ ఆనవాలు లేకుండా, దాని జ్ఞాపకాలు అంతః చేతన మనసు నుండి కూడా తొలగించివేయటం.

ఈ తొలగింపు ప్రక్రియల కోసం మనం ఆధ్యాత్మికత యొక్క అన్ని విభిన్న కోణాలు లేదా పద్ధతుల సహాయం తీసుకోవాలి. రాబోయే రెండు రోజుల సందేశాలలో, ఆధ్యాత్మికత యొక్క 7 విభిన్న పద్ధతులను వివరిస్తాము, వీటిని మన జీవితంలో చేర్చినట్లయితే, తేలికతనం మరియు గతం యొక్క ఎమోషన్స్ నుండి స్వేచ్ఛను పొందడంలో మనకు సహాయపడుతుంది. వాటన్నింటికీ వాటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »
1st Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము.

Read More »