Hin

7th jan 2025 soul sustenance telugu

January 7, 2025

గౌరవం మరియు ఆదరణ – ఈ రెండూ వేరా?

అందరూ అనుకున్నట్టుగా కాకుండా, గౌరవం మరియు ఆదరణ భిన్నమైనవి. ఆదరణ అనేది వ్యక్తుల పాత్రలు, హోదా వలన ఇవ్వబడిన మర్యాద యొక్క బాహ్య చిహ్నం. గౌరవం అనేది అంతర్గతమైనది, ఆ వ్యక్తి ఔన్నత్యాన్ని బట్టి వచ్చే భావన మరియు వైబ్రేషన్. ఆదరణ మారవచ్చు, కానీ గౌరవం అందరికీ సమానంగా ఉండాలి. వ్యక్తులను గౌరవించడానికి మరియు ఆదరించడానికి మీ పారామితులు ఏమిటి? వయస్సు లేదా హోదాలో మీ కంటే జూనియర్ లేదా మీ కంటే తక్కువ సాధించిన వారితో మీరు ఎంత బాగా వ్యవహరిస్తారు? గౌరవం మరియు ఆదరణ ఒకటే అని మీరు నమ్ముతున్నారా? సమాజంలో మన పాత్రలు మరియు హోదాలు భిన్నంగా ఉంటాయి. మనం పాత్రలను హెచ్చు తగ్గులు గా చూస్తాము.  మనము గౌరవం మరియు ఆదరణలను కలిపేసాం కూడా. గౌరవం అనేది ఒక వ్యక్తి గురించి మనకున్న అనుభూతి. ఆదరణ అనేది వ్యక్తుల విజయాలు, పాత్రలు మరియు వారి సొత్తు యొక్క బాహ్య చిహ్నం. వ్యక్తుల పాత్రలు మరియు హోదా ప్రకారం మనం మర్యాదలను ఇవ్వాలి మరియు బాహ్యమైన విధానాలను అనుసరించాలి. కాబట్టి ఆదరణ వ్యక్తి యొక్క పాత్రకు ఇవ్వబడేది. గౌరవం ఆత్మకు ఇవ్వబడేది. మనమందరం సమానంగా స్వచ్ఛమైన, మంచి మరియు సమానమైన ఆత్మలం కాబట్టి, గౌరవం మారకూడదు. ప్రతి వ్యక్తి సమానంగా మరియు ఒకే రకంగా గౌరవించబడాలి. మంచి ఆలోచనలను ప్రసరిస్తూ, మంచిగా మాట్లాడండి మరియు అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. ఇలా వారి పట్ల గౌరవం రేడియేట్ అవుతుంది. వారికి ఉన్నదాని ఆధారంగా మీరిచ్చే ఆదరణ మారవచ్చు, కానీ వారి పట్ల మీ గౌరవం మారకూడదు.

గౌరవం అనేది మీ సంబంధాలకు పునాది, గౌరవము మరియు ఆదరణ భిన్నమైనవని గుర్తించండి. ఆత్మకు గౌరవం ఇవ్వండి మరియు వారి కార్యానికి ఆదరణ ఇవ్వండి. వ్యక్తుల వయస్సు, జ్ఞానం, విజయాలు, సంపద, పాత్రలు లేదా హోదాలకు ఆదరణ ఇవ్వండి. గౌరవాన్ని, ఆదరణని సమానం చేయవద్దు. వ్యక్తుల పాత్రను బట్టి మీరిచ్చే గౌరవం మారకూడదు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మీరు వారిని గౌరవిస్తూనే ఉండాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మరియు అందరినీ గౌరవించండి. ప్రతి వ్యక్తిని వారు ఎవరో, వారి లక్షణాలను, స్వభావాలను గౌరవించండి. మీ ప్రతి పరస్పర చర్యలో ఇతరులకు స్వచ్ఛమైన వైబ్రేషన్ తో  ప్రారంభించండి. ఎవరినైనా కలసే ముందు, ముందుగా వారి కోసం మంచి వ్యక్తి లేదా శాంతియుత వ్యక్తి అనే ఆలోచనను సృష్టించండి, ఆపై మీరు వారితో మాట్లాడుతూ చర్యలోకి రండి. వారి ప్రవర్తనను అంగీకరిస్తూ ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ  ప్రశ్నించకుండా ఉండండి. వారు ఎవరు అనే వారితో కనెక్ట్ అవ్వండి మరియు వారు పోషించే పాత్రలకు కనెక్ట్ అయ్యే ముందు, నిజమైన గౌరవం యొక్క పునాదిని నిర్మించండి. మీ ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన యొక్క వైబ్రేషన్స్ అందరికీ ఒకే విధంగా ఉండాలి, మీ గౌరవం అందరికీ సమానంగా ఉండాలి.

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »