Hin

13th dec 2024 soul sustenance telugu

December 13, 2024

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 2)

  1. మిమ్మల్ని మీరు ఆత్మిక దృష్టితో చూడటం ప్రారంభించండి, అప్పుడు మీరు సదా విజయవంతమయ్యారని మీకు అనిపిస్తుంది – ఆధ్యాత్మిక జ్ఞానం మనల్ని మనం ఆత్మిక దృష్టితో లేదా జ్ఞాన నేత్రాలతో చూసుకోవాలని బోధిస్తుంది. మన భౌతిక కళ్ళు మన భౌతిక స్వయాన్ని మరియు వయస్సు, లింగం, రూపం, బాహ్య వ్యక్తిత్వం, జాతీయత, సంబంధం, మతం, డిగ్రీ, పాత్ర, సంపద మొదలైన అన్ని భౌతిక వాస్తవాలను చూపుతాయి. మనల్ని మనం ఆత్మలుగా భావించి, మన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరియు మన జీవితంలో భగవంతుని ప్రాముఖ్యతను గ్రహిస్తూ అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, అది మన జీవితంలో కొత్త లోతును తెలపడంతో ఉపరితలంపై జీవితాన్ని గడపడానికి బదులుగా, మనం మరింత లోతుగా వెళ్లి మనల్ని మనం బాగా అర్థం చేసుకుంటాము. మనం ఇతర ఆత్మల పాత్రలను, జీవిత సంఘటనలను కూడా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాము. వాటి తాత్కాలికతను గ్రహించి, ఎలా మన సంతోషాన్ని వాటిపై ఆధారపడేలా చేయవలసిన అవసరం లేదనే దాన్ని అర్థం చేసుకుంటాము. చివరగా, ప్రతిరోజూ భగవంతుని జ్ఞానాన్ని వింటూ, ధారణ చేస్తూ ఉంటే మన నమ్మకాలు భౌతికంగా గెలవడం మరియు ఓడిపోవడం నుండి భగవంతునితో సహా ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకోవడం వైపుకు మారుతాయి. మనం బలహీనతలను విడిచిపెట్టి పరిపూర్ణ మానవులుగా మారుతాము. బాహ్య విజయాలు, ఓటములు కాకుండా ఆంతరిక మంచితనం ఆధారంగానే భగవంతుడు మరియు అందరూ ప్రేమిస్తారు.

 

  1. జీవితంలో ప్రతి చిన్న విజయం లేదా సానుకూల చర్యకు మీకు మీరు మరియు ఇతరులకు గౌరవం ఇవ్వండి – ఈ రోజు నుండి, మీ బిడ్డ లేదా మీ కార్యాలయ సహోద్యోగి లేదా మీకు ఇష్టమైన క్రీడా బృందం ఉత్తమంగా ప్రయత్నిస్తున్నప్పుడల్లా, వారికి సానుకూల పదాలు చెప్పండి, వారి పట్ల సానుకూల ఆలోచనలు, భావాలను కలిగి ఉండండి. అలాగే, మీరు లేదా ఇతరులు చేసే ప్రతి చిన్న మంచి పనికి ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించి దాని ఫలితం గురించి ఆలోచించవద్దు. ఆధ్యాత్మిక జ్ఞానం మీ సానుకూల చర్యలను చక్కగా నిర్వహించి మీరు ప్రతిఫలంగా పొందే వాటి ఫలాల గురించి ఆలోచించవద్దని చెబుతుంది. దీన్ని నిజ జీవితంలో అమలు చేయండి – ప్రతి చర్యను భగవంతుని స్మృతితో చేస్తూ, చేసిన తర్వాత సంతోషంగా ఉంటూ దాని ద్వారా ఇతరులకు సంతోషాన్ని ఇవ్వండి. మీ ఆత్మగౌరవం మరియు ఆనందాన్ని ప్రపంచం పెద్దవిగా నిర్వచించిన విజయాలపై మాత్రమే ఆధారపడకండి. ఎందుకంటే ఆ పెద్ద విజయాలు తాత్కాలికమైనవి, అవి ఎల్లప్పుడూ మనతో ఉండవు. ప్రతి చర్యను, దాని ఫలితంతో సంబంధం లేకుండా మనం ఎంత ఎక్కువగా ఆస్వాదించడం ప్రారంభిస్తామో, అంత ఎక్కువగా మనం మునుపెన్నడూ లేని విధంగా విజయవంతమవుతాము. మన ఇల్లు, ఆఫీసు మరియు సమాజంలోని ఇతరులకు అదే శక్తిని ప్రసరిస్తాము, ఇదే ప్రతిచోటా అత్యవసరంగా కావాల్సింది. లేకపోతే, మానవులు అతిగా పోటీ పాడడం వల్ల నెమ్మదిగా ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవిస్తున్నారు. తాము సంతోషంగా ఉండటం లేదు, ఇతరులకు సంతోషాన్ని ఇవ్వటం లేదు.

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »