Hin

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

December 12, 2024

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

మనం ఒక పోటీలో ఉన్నామని, జీవితం ప్రతి క్షణం గెలవడం గురించెనని మన రోజువారీ జీవితంలో తరచుగా వింటాము. అలాగే, శారీరక స్థాయిలో ఏదైనా విజయం సాధించినప్పుడు చాలా సంతోషపడటం మనకు అలవాటయింది. అది మన విద్యలో కావచ్చు లేదా మన కెరీర్ లో కావచ్చు లేదా సంబంధంలో కావచ్చు లేదా ఒక క్రీడలో గెలుపు వైపు ఉండటం కావచ్చు. మరోవైపు, జీవితంలోని ఈ అంశాలలో దేనిలోనైనా విజయవంతం కానప్పుడు లేదా అంత బాగా చేయలేనప్పుడు మనం నిరుత్సాహం, నిరాశకు గురవుతాము. ధారుణం ఏమిటంటే, మన ఆత్మగౌరవం లేదా మనల్ని మనం చూసుకోవటం అనేది మన ప్రస్తుత జీవితంలో ఈ హెచ్చు తగ్గులను బట్టి చూడటం ప్రారంభించాము. ఇవి మన జీవితంలోని తాత్కాలిక అంశాలని మనం మరచిపోయాము. ఈ విజయాలు, వైఫల్యాల కళ్ళజోళ్ళతో అందరూ మనల్ని చూడటం ప్రారంభించారు. దానితో వారి మనస్సులలో మనకు అలా పేర్లు పెట్టడం ప్రారంభించినప్పటికీ, మనకు మనం మరియు ఇతరుల కొరకు మనల్ని మనం అలా చూసుకునే అవసరం లేదు. పిల్లలు పెరుగుతున్న వయసులో వాళ్ల చదువుల్లో లేదా ఆటల్లో లేదా ఇతర కార్యక్రమాల్లోనైనా ఈ గెలుపు ఓటమిల ఆధారంగా మనం వాళ్ళని అంచనా వేస్తున్నందుకు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మన జీవితంలో ఈ సమస్యను అధిగమించడానికి మూడు మార్గాలను తెలుసుకుందాం – 

  1. గెలవడం, ఓడిపోవడం అనేవి బాహ్యమైనవి. నేను సంతోషంగా, సంతృప్తిగా ఉంటే, నేను ఎల్లప్పుడూ గెలిచినట్లే – మొట్టమొదటి దశ ఏమిటంటే, బలవంతులదే మనుగడ అనే సిద్ధాంతంతో, మనం సమాజంలో లోతైన పోటీని ప్రవేశపెట్టి, మన జీవితాన్ని చాలా కష్టతరం చేసాము. ఇప్పుడు మనం ఆ పోటీ నుండి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నాము. మనం ఎక్కడ చూసినా, అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు లేదా మన వృత్తిపరమైన జీవితంలో కావచ్చు, లేదా మన పాఠశాల మరియు కళాశాల పెంపకంలో అయినా,  అంతా బాహ్య విజయానికి సంబంధించిందే. చాలా సందర్భాలలో, అందరూ దీని కారణంగా ఆంతరికంగా బాధపడుతూ అంత సంతోషంగా లేరు. మనం ఆత్మలమని   మరచిపోయాము. మనకు విజయం అంటే స్వచ్ఛంగా, సానుకూలంగా ఉంటూ శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి వంటి మన అసలైన సుగుణాలతో నిండి ఉండటం. అలాగే, మనం బాహ్యమైన గెలుపు ఓటములపై మాత్రమే దృష్టి సారించినప్పుడు, ఇక జీవితాన్ని ఆస్వాదించము. మనం వెంబడించడం మరియు వెతకడం మాత్రమే చేస్తూ ఉంటాము. ప్రతిరోజూ ఆధ్యాత్మికంగా మరియు భావోద్వేగపరంగా మరింత ఖాళీగా మారుతూ ఉంటాము. మన సుగుణాలు తగ్గుతూ ఉంటాయి. 

(సశేషం…)

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »