Hin

25th may 2024 soul sustenance telugu

May 25, 2024

జ్ఞానాన్ని మధిస్తూ  దాని ప్రయోజనాల అనుభూతిని పొందండి   (పార్ట్ 1)

రోజును సానుకూలంగా ప్రారంభించడం సానుకూలత మరియు ప్రయోజనంతో నిండిన రోజుకు పునాదిని ఏర్పరుస్తుంది. ఒకప్పుడు ఒక తోటమాలి తన మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అతను ఆ మొక్కలతోనే రోజును ప్రారంభించేవాడు, వాటికి నీరు పోస్తూ, సరైన మొత్తంలో సూర్యరశ్మి మరియు మంచి రకమైన మట్టితో వాటికి పోషణ అందేలా చూసుకునేవాడు. తోటమాలికి మొక్కల పట్ల ఉన్న ప్రేమ అతని మొక్కలను చుట్టూ ఉన్నవారు ప్రేమించడం ప్రారంభించిన విధానంలో కనిపిస్తుంది. ఇతరులు కొన్నిసార్లు అతని అందమైన మొక్కల రహస్యాన్ని అడిగినప్పుడు, అతను తన మొక్కలకు తెల్లవారుజామున తాను ఇచ్చే పాలన రోజంతా సానుకూలంగా పెరిగేలా చేస్తుంది అని చెప్పేవాడు.

 

మనమందరం కూడా రోజంతా ఆలోచించాలి, మాట్లాడాలి మరియు పనులు చేయాలి. ఇవన్నీ ఇతరుల ప్రశంసలతో నిండి ఉండేలా పరిపూర్ణంగా ఉండాలి. విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న ఆలోచనా విధానాలతో, కొన్నిసార్లు మన చుట్టూ స్వంత ప్రాధాన్యతలతో ఉన్న వారు అనేకులు ఉన్నప్పుడు చేయడం కష్టం అవుతుంది. ఇవి కొన్నిసార్లు మన పరిపూర్ణత వైపు నుండి మనలను దూరం చేస్తాయి.  మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలు మనం కోరుకున్నంత పరిపూర్ణతను కలిగి ఉండవు. అటువంటి సందర్భాలలో, పరిపూర్ణమైన ఆలోచనలు, మాటలు మరియు చర్యలతో నిండిన రోజుకి పునాదిగా ఉదయం పూట సానుకూలతతో ప్రారంభించబడిందని మనం మరచిపోతాము. ఇక్కడ పాజిటివ్ అంటే ఒకటి లేదా రెండు పేరాలు సానుకూల సమాచారాన్ని చదవడం. మన ఆలోచనలను రోజంతా సరిపోయేలా ఉంచడానికి ఇది ఒక వ్యాయామం లాంటిది, ఫలితంగా మన మాటలు మరియు చర్యలను స్వచ్ఛత మరియు సానుకూలతతో ఉంచుతుంది.

బ్రహ్మా కుమారీల వద్ద, మేము రోజును ప్రారంభించే ముందు తప్పకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటాం. ఎందుకంటే రోజంతా మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలను శ్రేష్టంగా ఉంచుతున్న దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. ఉద్యానవనానికి ఉదయాన్నే శ్రద్ధ అవసరం అయినట్లే, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు మరియు వైఖరుల పువ్వులతో కూడిన మన మనస్సు యొక్క ఉద్యానవనానికి ఉదయం శ్రద్ధ అవసరం. ఇది మాటలు, చర్యలు మరియు సంబంధాలతో కూడిన మన  పూర్తి వ్యక్తిత్వాన్ని రోజంతా మంచిగా ఉంచుతుంది.

 

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »
9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »