Hin

26th may 2024 soul sustenance telugu

May 26, 2024

జ్ఞానాన్ని మథిస్తూ దాని ప్రయోజనాల అనుభూతిని పొందండి  (పార్ట్ 2)

స్వచ్చమైన మనస్సు మన ఆలోచనలు, మాటలు మరియు చర్యల ద్వారా ఒక అందమైన వ్యక్తిత్వానికి రూపొందిస్తుంది. కాబట్టి తెల్లవారుజామున మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆ సమయంలో మనస్సుకు గ్రహించుకునే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మ, పరమాత్మ ఆధారమైన ఆలోచనల రూపంలో దానికి సూచనలను ఇవ్వడం మనస్సును ఆత్మిక స్థితిలోకి తీసుకువస్తుంది. రోజంతా ఆత్మ తన స్మృతిని మరియు పరమాత్మ పై దృష్టి సారించడానికి ఇది మనస్సుకు శిక్షణ.

 

ఎప్పుడైనా ఒక రోజు, మీకు అది చెడ్డ రోజు అని అనిపిస్తే, ఆ నిర్దిష్ట రోజు ఎలా ప్రారంభం అయిందో చెక్ చేసుకోండి. రోజు యొక్క ప్రారంభం బాగా లేనప్పుడు, అది రోజంతా ప్రతికూలంగా గడపడానికి దారితీస్తుందని మీరు గ్రహిస్తారు. అలాగే, మీ ప్రియమైనవారి సహవాసంలో సానుకూలంగా ప్రారంభమైన రోజు లేదా మంచి వార్త వినడం లేదా సానుకూల సమాచారాన్ని గ్రహించడం లేదా టెలివిజన్‌లో ఆధ్యాత్మికత యొక్క మంచి కార్యక్రమాన్ని చూడటం ద్వారా ప్రారంభమైన రోజు సానుకూలంగా గడుస్తుంది. మరోవైపు, టీవీలో ప్రమాదాలు, మరణం మరియు హింసకు సంబంధించిన ప్రతికూల వార్తలను చూడటం లేదా వినడం లేదా ప్రతికూల సమాచారాన్ని చదవడం లేదా ఎవరితోనైనా వాదనతో ప్రారంభమైన రోజు ప్రతికూల సంఘటనలతో ఉంటుంది. ఇది ఎందుకు? ఆలోచనలకు ఉదయమే ఆకారం ఇవ్వబడుతుంది మరియు ఆ తర్వాత రోజులో అవి తదనుగుణంగా పనిచేస్తాయి. అలాగే, రాత్రి నిద్రపోయే ముందు మనసులోని ఆలోచనలు మరుసటి రోజు ఉదయం మానసిక స్థితిపై ప్రభావం చూపి, రోజంతా ప్రభావితం చేసి, రాత్రి వరకు మనస్సులో ఉంటుంది. కాబట్టి, ఇది ఒక చక్రం. చక్రాన్ని సానుకూలంగా ఉంచడానికి, ప్రారంభం ఉదయాన్నే జరగాలి. ఆహారం ఎలా ఉంటే మనసు అలా ఉంటుందని అంటారు-అంటే మనము ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటూ లేదా సానుకూల శక్తితో లేదా సాత్విక ఆహారాన్ని తీసుకుంటే అది మనస్సును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు, తక్కువ ఎనర్జీ లెవెల్స్‌తో తిన్న ఆహారం లేదా తామసిక ఆహారం మనస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మనం తినే భౌతిక ఆహారానికి ఇది వర్తిస్తుంది. అదే విధంగా, “ ఆలోచనలు మనసుకు ఆహారం అని అంటారు” మన ఆలోచనల నాణ్యత కూడా మన మానసిక స్థితిని, పూర్తి ఆంతరిక స్థితిని మరియు మన భావాలను  ప్రభావితం చేస్తుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd november 2024 soul sustenance telugu

త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

మానసిక స్వచ్ఛత, ఆంతరిక శక్తిని అనుభవం చేసుకోవడం – ఆధ్యాత్మికత యొక్క ఒక ముఖ్యమైన అంశం త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం. మనకు హాయిగా అనిపించటానికి మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నామనే దానిపై మాత్రమే

Read More »
2nd november 2024 soul sustenance telugu

మీ సంబంధాలలో దాతగా ఉండండి

ఈ రోజు మన సంబంధాలలో మనం శ్రద్ధ చూపేవారిలా, ధ్యాస పెట్టేవారిలా మరియు క్షమించేవారిలా ఉన్నామా అని చెక్ చేసుకుందాము. మనం ఇచ్చేవారిగా ప్రారంభిస్తాము, కానీ క్రమంగా వస్తువుల కోరిక వైపు మారుతాము. మనం

Read More »
1st november 2024 soul sustenance telugu

ఈ దీపావళికి దివ్యమైన జ్యోతిని వెలిగించండి (పార్ట్ 2)

దీపాలను వెలిగించడం దీపావళికి అత్యంత ముఖ్యమైన అంశం. ఒక్క దీపం అపారమైన అందాన్ని కలిగి ఉండి చీకటిని తొలగిస్తుంది. ఆధ్యాత్మికంగా, మనం తొలగించాల్సిన చీకటి ఏమిటి? మన అసత్యపు గుర్తింపు మరియు అజ్ఞానం.  బంకమట్టితో

Read More »