Hin

27th may 2024 soul sustenance telugu

May 27, 2024

జ్ఞానాన్ని మథిస్తూ దాని ప్రయోజనాల అనుభూతిని పొందండి (పార్ట్ 3)

మీరు రోజును ప్రారంభించినప్పుడల్లా, మీ మనస్సులో కొన్ని సానుకూల ఆలోచనలను సృష్టించండి. వాకింగ్ కి వెళ్లినా లేదా రోజు కోసం తయారీ చేసుకుంటున్నా, ఈ ఆలోచనలను పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. దానికి ముందు, మీ మనస్సును సానుకూల ఆలోచనలతో నింపేది ఏదైనా చదవండి. ఖాళీ మనస్సు సానుకూలంగా ఆలోచించడానికి, సానుకూల ఆలోచనలను సృష్టించడానికి ప్రయత్నిస్తే, అది త్వరగా అలసిపోయి ఒత్తిడికి గురవుతుంది అని గుర్తుంచుకోండి. మీ మనస్సును సానుకూల సమాచారంతో నింపిన తర్వాత సానుకూల ఆలోచనలను సృష్టించడానికి ఒక రోజు ప్రయత్నించండి, మరుసటి రోజు మీ మనస్సు పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు సానుకూల ఆలోచనలను సృష్టించి తేడాను చూడండి. ఖాళీ మనస్సు కంటే  సానుకూల ఆలోచనలతో నిండిన మనస్సుతో లోతుగా ఆలోచించిన తర్వాత మీ ఆంతరిక శక్తి మరియు ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది.

మీగడను చిలికి వెన్నను వెలికితీసే ప్రక్రియతో దీనిని పోల్చవచ్చు. మీరు మీగడ లేకుండా ఖాళీ పాత్రలో త్రిప్పితే, మీకు వెన్న వస్తుందా లేదా పాక్షికంగా మీగడతో నిండిన పాత్రలో చిలికితే, మీరు నాణ్యమైన వెన్నను తీయకపోగా అలసట చెందుతారు. అదే విధంగా, మీ మనస్సులో జ్ఞానం ఉన్నప్పుడు, ఆ ఆధ్యాత్మిక జ్ఞానానికి లేదా వివేకానికి మీరు కొత్త దృక్కోణాలు, అభిప్రాయాలను జోడించడం ద్వారా సానుకూల సమాచారాన్ని గుణిస్తారు. దీనిని ఆధ్యాత్మిక శక్తి యొక్క వెన్నని తీయడానికి ఆధ్యాత్మిక జ్ఞాన మథనం అని అంటారు. కాబట్టి,  మీ మనస్సులో సానుకూల ధృవీకరణలను ఎల్లప్పుడూ, ఈ అదనపు సమాచారంతో పెట్టుకోవటం గుర్తుంచుకోండి. ఈ అదనపు సమాచారం మీరు జ్ఞాన పాయింట్లతో ఆడుకోవటానికి, విశ్రాంతి తీసుకునే కుషన్ లా ఉంటుంది. ఇది మూసి ఉన్న గదిలో బంతిని విసిరి, గోడ నుండి గోడకు బౌన్స్ చేయనివ్వడం లాంటిది. అదే విధంగా, జ్ఞానాన్ని మథనం చేయడం అంటే మీరు చదివిన వాటిని రిపీట్ చేయడం కాదు, మీ మనస్సు యొక్క గదిలో జ్ఞానాన్ని నెమరు వేయడం. దాని ఫలితంగా ఆనందాన్ని అనుభవించడంలో ఇది సహాయపడుతుంది. ఇటువంటి వ్యాయామం, చాలా రోజుల పాటు చేస్తే, ఆత్మ శక్తిని పెంచుతుంది మరియు మన మనస్సును బలపరుస్తుంది. వాస్తవానికి, ఇది మనల్ని చాలా సానుకూలంగా చేసి ప్రతికూల, అనవసరమైన ఆలోచనల నుండి విముక్తి కలిగిస్తుంది. లేదంటే వాటిలో మనం పదేపదే మునిగిపోయినప్పుడు అవి మన మానసిక శక్తిని వృధా చేస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »