Hin

24th mar 2024 soul sustenance telugu

March 24, 2024

హోలీ యొక్క ఆధ్యాత్మిక అర్థం (పార్ట్ 1)

హోలీ పండుగ సందర్భంగా హోలికను సూచించే చితి పైన ఒక దిష్టిబొమ్మతో భోగి మంటలు పెడతారు. ఇది మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్న చెడు లేదా ప్రతికూలతను ఆధ్యాత్మికంగా సూచిస్తుంది. భోగి మంటలను సిద్ధం చేయడానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కొమ్మలు మరియు చెక్క ముక్కలను అందిస్తారు. దీనర్థం మనలో ప్రతి ఒక్కరూ మన అనారోగ్య సంస్కారాలు, తప్పుడు అలవాట్లు, పగలు, గతంలోని బాధలు మరియు నెరవేరని కోరికలను వదిలిపెట్టాలి. హోలికా దహనం లేదా రాత్రిపూట చితిని కాల్చడం మరియు అందరూ భోగి మంటల చుట్టూ నృత్యం చేయడం, మన ప్రతికూలతలను మనం కాల్చాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. అవి తిరిగి రాకుండా బూడిదగా మండిన తర్వాత మాత్రమే మనం సంతోషించగలం. ఇది స్వచ్ఛత మరియు సద్గుణాలతో కూడిన కొత్త ప్రపంచాన్ని ప్రారంభించడానికి పాత ప్రపంచంలోని చెడుకు నిప్పు అంటించడాన్ని కూడా సూచిస్తుంది.

 

మన ప్రతికూల సంస్కారాలను కాల్చడానికి సులభమైన మార్గం మెడిటేషన్. మెడిటేషన్ అంటే స్వచ్ఛత మరియు ప్రేమ సాగరులైన పరమశక్తితో శక్తివంతమైన వ్యక్తిగత సంబంధం. మనం ఎవరినైనా గుర్తుచేసుకున్నప్పుడు, మనం వారితో సంబంధం కలిగి ఉంటాము, దానిని యోగం అంటారు. మనం పరమాత్మ యొక్క శక్తివంతమైన స్మరణలో ఉన్నప్పుడు, యోగ అగ్ని (జ్ఞాపకం అనే అగ్ని) అన్ని మలినాలను కాల్చివేస్తుంది. పురాణాల ప్రకారం, ఇది రాక్షస రాజు హిరణ్యకశిపుడను, హోలికను అంతం చేయడం మరియు భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించిన దానికి జరుపబడుతుంది. కాబట్టి, ఇది సమర్పణను మరియు నిశ్చయ శక్తిని గుర్తు చేస్తుంది. మనకు సదా లోతైన నిశ్చయం ఉన్నప్పుడు, పరమాత్మ మనలను బాధ  మరియు చింతల నుండి రక్షిస్తారు.

 

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »