Hin

14th march 2025 soul sustenance telugu

March 14, 2025

హోలీ యొక్క వివిధ ఆధ్యాత్మిక ఛాయలను అనుభవం చేసుకుందాం

హోలీ (మార్చి 14) రంగులు, ప్రేమ మరియు సామరస్యం యొక్క పండుగ.

కాబట్టి మన బలహీనతలు, లోపాలు మరియు ఇతరుల పట్ల ద్వేషం యొక్క పొడి కర్రలను కాల్చివేద్దాం.  క్షమించి, పరిపూర్ణతను మరియు మంచితనాన్ని పెంపొందించుకుందాం.  

మన మనస్సులో మనం పట్టుకున్న వాటిని ఇతరుల కోసం తొలగించుకుందాం. ఇది మన అంతర్గత శక్తినే తగ్గిస్తుంది మరియు మన ప్రతికూల ప్రకంపనలు అవతలి వ్యక్తికి ప్రసరించి మనలో అసమానతను మరియు మనకు, వారికి బాధను కలిగిస్తాయి.  

ప్రేమ, నమ్మకం మరియు కరుణ యొక్క శాశ్వత రంగులతో ఒకరినొకరు అలంకరించుకుందాం.  భగవంతుని బేషరతు ప్రేమతో మనకు మనం రంగు వేసుకొని మనం కలిసే ప్రతి ఒక్కరికీ అదే రంగును వేయాలి. 

హో లి అంటే నేను ఒకరికి చెందినవాడిని అని అర్థం.  కాబట్టి ఆత్మనైన నేను పూర్తిగా భగవంతుడికి లేదా పరమాత్మకు చెందినవారిగా అయ్యి ఆధ్యాత్మిక జ్ఞానం సహాయంతో వారితో ఉన్న అన్ని సంబంధాలను అనుభవం చేసుకుందాము. 

హో లి అంటే గతం గడిచిపోయింది అని అర్థం. ఏదైనా నిర్దిష్ట పరిస్థితి కారణంగా మన గురించి లేదా ఇతరుల గురించి మన మనస్సులో ఏదైనా బాధాకరంగా ఉంటే, మనకు మనం గుర్తు చేసుకుందాం, ఇది గతం, అది ముగిసింది మరియు తేలికయిన సానుకూల మానసిక స్థితితో ముందుకు వెళ్దాం.  

హో లి అంటే మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో స్వచ్ఛత మరియు చిత్తశుద్ధితో ఉండటం. దాన్ని ఆచరించి మంచి వ్యక్తిగా మారి, మన జీవితాలను అందంగా మార్చుకుందాం.

హోలీ యొక్క అర్ధాన్ని పూర్తిగా జీవించి, ప్రస్తుత క్షణంలోనే కాకుండా, రాబోయే సంవత్సరంలో ప్రతి రోజు దాని విభిన్న ఆధ్యాత్మిక ఛాయలను అనుభవం చేసుకుందాం.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »