Hin

15th dec 2023 soul sustenance telugu

December 15, 2023

ఇదే సరైన సమయం

మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను… పుట్టినరోజు… వారాంతం… వచ్చే వారం… వచ్చే నెల చేస్తాను అంటూ వాయిదా వేసే అలవాటు మీకుందా?  సాధారణంగా మనం కొన్ని పనులను వాయిదా వేస్తుంటాం – చివరి తేదీ వరకు బిల్లు కట్టకపోవడం లేక పన్ను కట్టడం వాయిదా వేస్తుంటాం. ఒక బంధం ముక్కలయ్యే వరకు, రోగం వచ్చే వరకు ఆరోగ్యకర ఆహారపు డైటును ప్రారంభించకపోవడం, అనారోగ్యం వచ్చేవరకు వ్యసనాలను విడిచిపెట్టకపోవడం, డాక్టరు చెప్పేవరకు వ్యాయామం లేక మెడిటేషన్ చేయకపోవడం… ఎంత ఎక్కువ మనం వాయిదా వేస్తుంటామో అంత ఎక్కువగా మంచి మన జీవితంలోకి రాకుండా మనమే అడ్డుకట్ట వేస్తున్నాం. ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియకపోతే వెంటనే సరైన మార్గదర్శన తీసుకోండి. మీరు చేయాలని అనుకోకపోతే, సమయం లేదు, నమ్మకం లేదు, ఆత్మ విశ్వాసం లేదు అనే సాకులు చెప్పడం మానండి. ఇప్పుడు ప్రారంభించాలి అన్నది ఒక్క ఆలోచన దూరంలోనే ఉంది. దృఢంగా ఉండండి, మనసును క్రమశిక్షణతో ఉంచండి. మనకు మనం గుర్తు చేసుకుందాం – నా పనులు, నా ఆనందం మరియు నా ఆరోగ్యానికి నేను కట్టుబడి ఉన్నాను. నేను దేనికీ ఆలస్యం చేయను. నేను ఇప్పుడు చర్య తీసుకుంటాను.

మన సామర్థ్యాన్ని పరిమితం చేసే ఒక అలవాటు ఏమిటంటే, పనులను పదే పదే వాయిదా వేయడం. నేను ఈ పని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, రేపు చూద్దాంలే అంటూ ఎన్నిసార్లు మనల్ని మనం నమ్మబలికామో గమనించండి. రేపు చేస్తాను అనుకుని, మరుసటి రోజు రాగానే చేయాలన్న ఆలోచనను ప్రక్కన పెట్టేస్తున్నాము. చివరకి రేపు అనేది ఎప్పుడో గానీ రావడం లేదు, ఒక్కోసారి అస్సలు రావడం లేదు. ఆ అంతర్గత ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడానికి, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ క్షణం తీసుకోండి, ఇదే సరైన సమయం. తక్కువ ఆలోచించాలి, ఎక్కువ చేయాలి అనే నిజమైన క్రమశిక్షణను మీలో అలవర్చుకోండి. వాయిదా వేసే అనారోగ్యకరమైన ప్రక్రియలు మీలో నెమ్మదిగా తగ్గడాన్ని మీరు గమనిస్తారు. మీకు తెలిసిన పనులను మీరు చేయడం ప్రారంభించినప్పుడు, మీ సంతృప్తి మరియు ఆనందం అపారంగా ఉంటాయి. మీ అభిరుచి పెరుగుతుంది. మీ ఆలోచనలు మరియు కోరికలను ప్రారంభించి, పూర్తి చేయడానికి ప్రేరణ పొందుతారు. మీలోని ప్రతిఘటన అంతా వెళ్ళిపోతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »