Hin

15th august 2024 soul sustenance telugu

August 15, 2024

ఇన్-డిపెండెన్స్ జరుపుకోవడం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక సందేశం-ఆగస్టు 15

మనందరికీ స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం కావాలి, కానీ అది మన స్వంత ఇల్లు, మన స్వంత గది, మన స్వంత డబ్బు మరియు మన స్వంత నిర్ణయాలు గురించి మాత్రమేనా? . మనమందరం రాజకీయ, ఆర్థిక, శారీరక మరియు సామాజిక స్వేచ్ఛను కోరుకుంటాము, కానీ ఇవన్నీ పొందిన తరువాత, మనం నిజంగా స్వతంత్రంగా ఉన్నామా? ఈ రోజు మన భావోద్వేగ స్వేచ్ఛను అన్వేషించుకుందాం. స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి, మన ఆధారాలను గుర్తించడం మంచి ప్రారంభ స్థానం. నేను ఇది లేకుండా చేయలేనని మనం చెపితే లేదా ఎవరైనా ఒక వ్యక్తి  లేకుండా జీవించలేనని చెపితే లేదా ఏదైనా ఒక సంస్కారం నా నియంత్రణలో లేదని చెపితే, అప్పుడు మనం మానసికంగా ఆధారపడి ఉంటాము. మన ఆధారాల ప్రాథమిక జాబితాలో మొబైల్, ఇంటర్నెట్, టెలివిజన్, కాఫీ, మద్యం, ధూమపానం, నిర్దిష్ట రకాల ఆహారం, షాపింగ్ మొదలైనవి ఉంటాయి.

కొంచెం ఎక్కువ చెక్ చేసుకుంటే మన లోతైన బంధనాలు మరియు ఆధారాలు తెలుసుకోవచ్చు –

  1. ఇతరులు, పరిస్థితులు నాకు అనుగుణంగా ఉండాలి.
  2. ఇతరుల ప్రశంసలు, ఆదరణ
  3. నా అభిప్రాయమే సరైనది, మీది తప్పు

…….. మన మనస్సు కలత చెందే అన్ని విషయాలతో మనం జాబితాను పూర్తి చేయవచ్చు.

మనం ఎల్లపుడు బాధపడుతూ లేదా కోపంగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సమాధానం అనేది తప్పు చేసిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది… వారు చేసినదానిపై ఆధారపడి ఉంటుంది…  వారు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన భావోద్వేగాలు వారు ఎవరో, వారు ఏమి చేశారో దానిపై ఆధారపడి ఉంటాయని మనము నమ్ముతున్నాము. నిజం ఏమిటంటే, వారు ఎవరో, వారు ఏమి చేశారో అనే దానితో సంబంధం లేకుండా మన మానసిక స్థితి లేదా మనం సృష్టించే ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది.  మనము మన స్వంత విశ్వాస వ్యవస్థలకు బానిసల వలె ఉన్నాము కాబట్టి మనల్ని మనం విడిపించుకుని, కొత్త ఆలోచనా విధానానికి, జీవన విధానానికి మేల్కొనే సమయం ఇది. స్వ-రాజ్యం అంటే మన మనస్సు, బుద్ధి, సంస్కారాలు మరియు భౌతిక ఇంద్రియాలపై పాలకుడు లేదా యజమాని అని అర్థం. ఇన్-డిపెండెన్స్ అంటే ఏదైనా ప్రవర్తన లేదా పరిస్థితికి ప్రతిస్పందించడానికి మన అంతర్గత గుణాలు మరియు శక్తులపై మాత్రమే ఆధారపడటం. ఇన్-డిపెండెన్స్ అంటే మనకు ద్రోహం చేసిన వారికి ఆశీర్వాదాలు ఇచ్చే శక్తి మనకు ఉంది; మనల్ని తిరస్కరించిన వారిని మనం శ్రద్దగా చూసుకోవచ్చు; మన పట్ల అసూయపడే వారితో మనం సహకరించవచ్చు; మనపై అరుస్తున్న వారితో మనం ప్రశాంతంగా మరియు మృదువుగా ఉండవచ్చు. కొత్త విశ్వాస వ్యవస్థను సృష్టించుకుందాం-ఇతరులు మరియు పరిస్థితులకు నా ప్రతిస్పందనతో సంబంధం లేదు. అనాదరికి ఎల్లవేళలా సరైన అనుభూతిని మరియు ప్రవర్తనను సృష్టించే ఎంపిక మరియు శక్తి నాకు ఉంది. నేను స్వతంత్రంగా ఉన్నాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »