Hin

30th-oct-2023-soul-sustenance-telugu

October 30, 2023

ఇంట్లోగానీ ఆఫీసులోగానీ నియమాలను తయారు చేసేటప్పుడు ఇతరులను కూడా కలుపుకోండి

ఇంట్లో మరియు కార్యాలయంలో కొన్ని నియమాలను కలిగి ఉండటం చాలా వ్యత్యాసాన్ని తీసుకు వస్తుంది. మేలుకునే సమయం, పడుకునే సమయం, భోజన సమయం, అలవాట్లు, వస్త్రధారణ, పనిలో నైతికత మొదలైనవాటికి సంబంధించిన మార్గదర్శకాలు క్రమశిక్షణను మరియు సంస్కృతిని నింపుతాయి. అయితే కొన్నిసార్లు, నియమాలను తయారు చేసేటప్పుడు, వాటిని పాటించవలసిన వ్యక్తుల అనుమతిని తీసుకోము. అందు కారణంగా కొందరు ఆ నియమాలను పాటించరు లేదా పాటించినా మనస్ఫూర్తిగా పాటించరు.

ఈ క్షణం, మీరు తయారు చేసిన నియమాలను ఇతరుల అనుమతితో చేసారా, వారి సమ్మతిని తీసుకున్నారా అని పరిశీలించుకోండి –

సంకల్పాలు:

నేను శక్తిస్వరూపాన్ని. నేను నా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నాను. నేను విలువలతో జీవిస్తున్నాను. కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో నేను పోషించే పాత్రలో… నేను అందరినీ గౌరవంతో అందరికీ క్రమశిక్షణను నేర్పిస్తూ వారిని శక్తివంతంగా చేస్తాను… కొన్ని అలవాట్ల నియమాలను తయారు చేయాలన్నప్పుడు… సభ్యతను పాటించాల్సినప్పుడు… నైతికతను అలవర్చుకోవలసి వచ్చినప్పుడు… ఉత్తమ పద్ధతులను పెంపొందించుకోవలసి వచ్చినప్పుడు… నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను అందరినీ కలుపుకుంటాను… ఇంట్లో, ఆఫీసులో… అందరినీ సంప్రదిస్తాను… వయసు, పాత్ర, హోదాల భేదాలను చూడను… నేను అందరినీ సమానంగా చూస్తాను… నేను అందరినీ చర్చలో పాల్గొనమంటాను… అందరిలో సన్నిహిత భావాన్ని కలిగిస్తాను… ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఎందుకు చేయాలి … అన్న నా భావనను వ్యక్తపరుస్తాను… నేను స్పష్టంగా వివరిస్తాను… నేను నా భావలను వారిపై రుద్దను… నేను వారి అభిప్రాయాన్ని తీసుకుంటాను… వారి భావాలను వారు ఎటువంటి భయం, సంకోచము లేకుండా… వ్యక్తపరిచే స్వేచ్ఛను వారికిస్తాను… వారిని కలుపుకున్నందున… వారిది విన్నందున… వారిని సంప్రదించిన కారణంగా… వారు సంతోషిస్తున్నారు… ఒక్కోసారి వారికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది… నేను వాటిని అర్థం చేసుకుంటున్నాను… నేను ఉత్తమమైన భావాన్ని ఎంచుకుంటాను… నేను ఒక పరిష్కారాన్ని తీసుకు వస్తున్నాను… అందరూ పాటించడానికి సమ్మతించిన ఒక మార్గదర్శకాన్ని నేను నిర్ణయిస్తాను… నేను వారి అనుమతి తీసుకుంటున్నాను… అమలు చేయడంలో నేను వారికి సహాయం చేస్తున్నాను… అమలు చేయడానికి అందరూ సంతోషంగా అంగీకరిస్తున్నారు… వారు జవాబుదారీతనం తీసుకుంటున్నారు… నియమాలను పాటించడం వారికి సౌకర్యంగా ఉంది… వారు నన్ను గౌరవిస్తున్నారు… నేను వారిని గౌరవిస్తున్నాను…  అందరూ మెరుగైన వ్యక్తులుగా అవ్వడానికి నేను మార్గదర్శన చేస్తున్నాను… సమ్మతించిన వాటిని వారు సంతోషంగా పాటిస్తున్నారు… ఇంట్లో మరియు ఆఫీసులో నేను చక్కని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తయారు చేస్తున్నాను… క్రమశిక్షణ… మర్యాద… ఆరోగ్యకరమైన అలవాట్లు… సంతోషము… సామరస్యము… అన్నీ ఉన్నాయి.

నియమాలు మరియు నిబంధనలను నిర్దేశించేటప్పుడు సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడానికి ఈ సంకల్పాలను కొన్ని సార్లు పునరావృతం చేయండి. వ్యక్తులు నియమాలను అనుసరించడం కంటే వాటిని ఎలా అనుసరించాలనుకుంటున్నారో మీరు చూస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »