Hin

29th november 2024 soul sustenance telugu

November 29, 2024

ఇతరుల ఆశలను నెరవేర్చటం

కొన్నిసార్లు ఇతరుల ఆశలను మనం భారంగా భావిస్తాము. మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, కార్యాలయ సహచరులు, పిల్లలు మరియు మన జీవితంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు. వారు మన ఎంపికలను, నిర్ణయాలను నియంత్రిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇతరుల ఆశలకు అనుగుణంగా జీవించడానికి అందరు తీవ్రంగా ప్రయత్నిస్తారు, కానీ చాలా మంది పూర్తిగా విజయవంతం కాలేరు. ప్రతి ఒక్కరూ అన్ని సమయాల్లో మనతో సంతోషంగా ఉండలేరు, కాబట్టి వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడం వల్ల మనం అలసిపోతాము.

  1. ఇతరుల ఆశలు మనలో ఒత్తిడిని సృష్టించి, వారిని సంతోషపెట్టలేకపోతున్నామనే భయం వైపు నడిపిస్తాయి. ఇది మన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ప్రతి విషయంలో మీ సామర్థ్యం, మీ ప్రాధాన్యత మరియు మీ సూత్రాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి, ప్లాన్ చేయండి, అమలుపరచండి, సాధించి మీ విజయాన్ని ఆస్వాదించండి.
  2. ప్రతి సంబంధంలో నిస్వార్థంగా శ్రద్ధ చూపుతూ మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వండి. ఆ తరువాత, మీరు ఇతరుల ఆశలను చేరుకుంటున్నారా, మీకు ఆమోదం లభిస్తుందా లేదా మిమ్మల్ని తగినంత మంచిగా చూస్తున్నారా అని చింతించటం మానేయండి. మీ కోసం స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచుకొని ఇతరులకు తెలియజేయండి.
  3. మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఇతరులకు ప్రేమను ప్రసరింపజేయండి. కానీ మీరు మీకు సామర్థ్యం లేకున్నా కూడా ఇతరుల ఆశలకు అనుగుణంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న జీవితాన్ని గడిపినట్లయితే, మీరు సంతోషంగా ఉండలేరు. మీ అసంతృప్తి మీరు ఎవరి ఆశలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కూడా బాధ, అసౌకర్యం యొక్క వైబ్రేషన్లను ప్రసరింపజేస్తుంది. మీ సంబంధాల శక్తిని దెబ్బతీస్తుంది.
  4. మీరు చేయవద్దని అనుకున్న పనిని చేయడానికి అంగీకరించకండి. మర్యాదగా, ధైర్యంగా తిరస్కరించండి. దాని గురించి తప్పుగా భావించవద్దు. ప్రామాణికంగా ఉండండి. మీరు ఎవరో మరియు మీరు ఎలా ఉన్నారో అందరూ మిమ్మల్ని ఆలా అంగీకరిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »
6th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా

Read More »