Hin

24th jan 2025 soul sustenance telugu

January 24, 2025

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా కానీ అసలు వారి విజయం వెనుక అర్థం మీ మనస్సు విశ్లేషించడం ప్రారంభిస్తుందా? ఎవరైనా ఉద్యోగం, చదువు, కుటుంబం, వ్యక్తిత్వం లేదా ఆస్తులలో మనకన్నా చాలా బాగా రాణిస్తున్నపుడు, వారు మన కంటే మెరుగ్గా ఉన్నారని అర్థం కాదు. ఆ నిర్దిష్ట సమయంలో వారు మనకంటే ఎక్కువ సాధించారని దీని అర్థం. వారిని అభినందించుదాం. ప్రతి ఒక్కరూ వారి ప్రస్తుత జన్మ లేదా గత జన్మల యొక్క వారి కర్మల ప్రకారం వారి న్యాయమైన వాటాను పొందుతారు, ఎక్కువ లేదా తక్కువ పొందరు.  ఇతరుల ఆనందం కోసం సంతోషంగా ఉండటం అంటే మనం మనతో సంతోషంగా ఉన్నామని అర్ధం. ఇది అహం, అసూయ లేదా అభద్రత వంటి మన బలహీనతలను కూడా తొలగిస్తుంది. మనం ఇతరులను పోటీదారులుగా చూడకపోతే, వారు మనతో సహకరిస్తారు. బాగా పనిచేసే ప్రతి ఒక్కరి కోసం, ప్రశంసలు పొందిన ప్రతి ఒక్కరి కోసం నేను సంతోషంగా ఉన్నానని గుర్తు చేసుకుందాం. నాకంటే ఎక్కువ సాధించిన వ్యక్తులు నన్ను ఇంకా బాగా చేయమని ప్రేరేపిస్తారు. నేను వారిని అభినందిస్తాను, వారి విజయాలకు  నేను ఆనందిస్తాను, వారి సంతోషాన్ని నేను కూడా అనుభూతి చేస్తాను. ఇది విశాలమైన హృదయంతోనే చేయవచ్చు. 

 

ఇతరులు కొత్త కారు లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసినప్పుడు, నాకు మంచిగా అనిపిస్తుందా లేదా అసూయగా అనిపిస్తుందా అని ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మన అసూయను బయటికి తీసుకురావచ్చు, కానీ ఇతరుల ఆనందం పట్ల సంతోషంగా ఉండటం మన పరిపక్వతని మరియు శక్తిని సూచిస్తుంది. వారికి క్రెడిట్ ఇవ్వడం అనేది అసూయ మరియు అహం యొక్క మన విధ్వంసక ఆలోచనలను ఓడించడానికి సులభమైన మార్గం. మరొక వ్యక్తి పట్ల మీరు ఎలా భావిస్తారో మరియు హృదయపూర్వక ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తారో అని ప్రతిబింబించడానికి ఈ ఒక్క క్షణాన్ని తీయండి. జీవితం పట్ల మీ దృక్పథాన్ని తిరిగి రూపొందించుకోండి. మీ వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి, ఇతరులు సాధించినదానికి నిజంగా సంతోషంగా ఉండండి. జీవితంలో జరుగుతున్న ప్రతిదానికీ మీ మనస్సు తెరుచుకుంటుంది. మీరు ఇతరుల విజయాల గురించి బలహీనంగా భావించడం మానేస్తారు. బదులుగా మీరు మీ విలువను గౌరవిస్తారు. సంతోషకరమైన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడం కంటే సహకరించడం మీ ఆరోగ్యాన్ని, మీ సంబంధాలను మరియు మీ వృత్తిని మెరుగుపరుస్తుంది.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »