Hin

13th sep 2024 soul sustenance telugu

September 13, 2024

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో ఇతరుల స్క్రిప్ట్ను వ్రాయడంలో బిజీగా ఉంటాము – వారు ఏమి మాట్లాడాలి, వారు ఎలా ప్రవర్తించాలి, వారు ఎప్పుడు స్పందించాలి… మనం వారి పాత్రలలో చిక్కుకుని మన పాత్రను మరచిపోతాము. అందరూ తమ సొంత స్క్రిప్ట్లను వ్రాసుకుంటారు, వారు మన అంచనాల ప్రకారం నటించలేరు.

  1. మీరు తరచుగా ఇతరులను అంచనా వేస్తూ, వారు ఎలా ఉండాలి, వారు ఏమి చేయాలి అనే దాని గురించి మనసులో వ్రాసుకుంటున్నారా? వారు మీ ప్రకారం లేని కారణంగా మీరు వ్రాసుకున్న స్క్రిప్ట్

ఎంత వ్యర్థమో తెలుసుకున్నారా ? ఇతరులపై దృష్టి పెట్టడం వల్ల మీ సమయం, శక్తి తగ్గిపోతాయి కాబట్టి ఆ అలవాటు మీ పెరుగుదల, అభివృద్ధిని ప్రభావితం చేసిందా?

  1. ఈ ప్రపంచ నాటకంలో మనమందరం నటులం, మన జీవితంలో అనేక పాత్రలు పోషిస్తున్నాము. మనం ప్రతి సన్నివేశంలో నటులం, దర్శకులం మరియు స్క్రిప్ట్ రైటర్లము కూడా. కానీ తోటి నటులతో మన పాత్రను పోషించేటప్పుడు, మనం వారి నటనపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తాము, వారి స్క్రిప్ట్ను మనసులో రాసుకొని, వారు దానిని అనుసరించాలని ఆశిస్తాము. కానీ ఇతరులు మన స్క్రిప్ట్ను అనుసరించలేరు.
  2. మన దృష్టి మన పనితీరుపై ఉండాలి. పాత్ర ఏమైనప్పటికీ, మన శాంతి, ప్రేమ, వివేకం యొక్క వ్యక్తిత్వం ప్రతి పాత్రలోనూ ప్రతిబింబించాలి. ఇతర నటులు సరిగ్గా నటించకపోయినా, మన నటన వారికి తమను తాము సరిదిద్దుకునే మార్గాన్ని చూపుతుంది.
  3. మీ స్వంత స్క్రిప్ట్ను పరిపూర్ణం చేయడం గురించి తెలుసుకోండి, ఇతరుల స్క్రిప్ట్ను కాదు. తేలికగా, ప్రశాంతంగా ఉండి, మీ తోటి నటులను శక్తివంతం చేస్తూ ప్రతి సన్నివేశాన్ని మంచిగా దాటండి. మీకు మీరే గుర్తు చేసుకోండి – నా తోటి నటుల నటనతో ప్రభావితం కాకుండా, ప్రతి పాత్రలో నా శాంతి మరియు ప్రేమ యొక్క వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకువస్తాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »
9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »