Hin

25th July 2024 Soul Sustenance Telugu

July 25, 2024

ఇతరులకు బాధ్యతలను అప్పగించడం

మనం ఒక కుటుంబానికి పెద్ద అయినా లేదా మన కార్యాలయంలో ఒక టీమ్ లీడర్ అయినా, కొన్నిసార్లు ఇతరులకు బాధ్యతను అప్పగించడంలో మనం అసురక్షితంగా ఉంటాము, మన వద్దే బాధ్యతను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. మీరు ఇతరులకు బాధ్యతలను అప్పగించడానికి సంకోచిస్తున్నారా అని చెక్ చేసుకోండి. మీరు చేసే పనిని ఆస్వాదిస్తూ ఉండవచ్చు, నియంత్రణను వదులుకుంటారేమోనని భయపడి ఉండవచ్చు, మంచి పని చేయడానికి ఇతరులను విశ్వసించలేరని లేదా అవతలి వ్యక్తి మీ కంటే మెరుగ్గా పనిచేస్తారని బెదిరిపోవచ్చు.

  1. అప్పగించటం అంటే కేవలం పనులను పూర్తి చేయడం మాత్రమే కాదు. ఇది మీ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరినీ శక్తివంతం చేసే ప్రక్రియ మరియు మీ జీవిత లక్ష్యం. ఒకప్పుడు మీ బాధ్యతలపై మిమ్మల్ని కొందరు విశ్వసించారు, ఇప్పుడు అదే శక్తిని ప్రవహించేలా చేయడం మీ వంతు.
  2. ఒక పని పూర్తి చేయటానికి అవసరం అయ్యేవి అందరికీ అందించి, విషయాలను వారి విధానంలో అమలు చేయడానికి వారికి స్వేచ్ఛను ఇవ్వండి. వారి పని శైలిలో జోక్యం చేసుకోకండి. మీ పూర్తి సహాయంతో అందుబాటులో ఉండండి, వారు మార్గదర్శకత్వం కోరితే లేదా విషయాలు తప్పుగా జరుగుతుంటే మాత్రమే జోక్యం చేసుకోండి.
  3. అప్పగించడం అనేది మనస్సులో కూడా ఉండాలి. విషయాలు ఎలా ఉండాలో అనే దానిపై మీ

మొహాన్ని వదిలేయండి. పనులు వేరే విధంగా, కొత్త మార్గంలో జరిగే అవకాశాన్ని మీ మనస్సుతో అంగీకరించండి. ఇతరుల విధానాల గురించి సందేహాన్ని లేదా భయాన్ని సృష్టించవద్దు. విశ్వాసం మరియు విజయం యొక్క వైబ్రేషన్లతో వారిని శక్తివంతం చేయండి.

  1. వారు పొరపాట్లు చేయవచ్చు, ప్రేమతో, గౌరవంగా వారికి మార్గనిర్దేశం చేయండి. మీ విశ్వాసం మరియు అంగీకారం యొక్క శక్తి, అందరూ తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వడానికి, చేతిలో ఉన్న పనిని విజయవంతం చేయడానికి సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th June 2025 Soul Sustenance Telugu

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అన్ని పరస్పర చర్యలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకురండి మనమందరం రోజంతా చాలా మంది వ్యక్తులతో సంభాషిస్తాము. మన మరియు వారి ఆలోచనలు,

Read More »
17th June 2025 Soul Sustenance Telugu

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు స్వీయ మార్పు కోసం స్వీయ బాధ్యత తీసుకోండి శక్తి మార్పిడులు సాధారణంగా మనం స్వీయ మార్పు పట్ల ఎలా మన దృష్టికోణం

Read More »
16th June 2025 Soul Sustenance Telugu

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ నాటకంలో మనం అనేక జన్మలలో అనేక రకాల వ్యక్తులను కలుస్తాం. ప్రతి జన్మలో వారి సౌరభం మరియు వారు ప్రసరించే

Read More »