Hin

8th feb 2025 soul sustenance telugu

February 8, 2025

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం

 

మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు. ప్రతి ఒక్కరూ ఇతరులకు భౌతికమైన సౌకర్యాలను ఇవ్వలేరు, కానీ మనమందరం ఇవ్వగల ఎమోషనల్ ఓదార్పుకు పరిమితి లేదు. ఈ రోజు ప్రపంచం క్షమాపణ, సంతోషం మరియు ప్రేమ కోసం చూస్తోంది… ఇతరులకు సేవ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? గతంలోని చేదును విడిచిపెట్టి, ఏమీ జరగని విధంగా ఇతరులను క్షమించగల వ్యక్తులను మనం కలుస్తాము. బాధ అనేది తమ సొంత సృష్టి, తమ సొంత ప్రతిస్పందన అని వారు అర్థం చేసుకుంటారు. వదిలిపెట్టలేని వ్యక్తులు కూడా ఉన్నారు. వారు అంటారు – ఆయన చేసిన పనిని నేను ఎప్పటికీ క్షమించను లేదా మరచిపోలేను. అలాంటి వ్యక్తులు జీవితాంతం అప్రియమైన జ్ఞాపకాలతో ఉంటూ వాటిని మళ్ళి జీవిస్తూ ఉంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని, సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పగ, బాధ లేదా ద్వేషాన్ని పెట్టుకోవడం వల్ల కలిగే అనవసరమైన మరియు స్వీయ-ప్రేరేపిత నష్టాన్ని మనం చెక్ చేసుకోవాలి.

 

ఎవరో ఒక కొబ్బరి వ్యాపారిని అడిగారు – దయచేసి నాకు ఒక రోజుకు కొన్ని కొబ్బరికాయలు అప్పుగా ఇవ్వగలరా? నేను సాయంత్రం వాటిని మీకు తిరిగి ఇస్తాను. దుకాణదారుడు బదులిచ్చాడు – మీరు కావాలనుకుంటే నేను మీకు కొబ్బరికాయలను తక్కువ ధరకు విక్రయించగలను, కానీ నేను మీకు వాటిని అప్పుగా ఇవ్వలేను. ఆ వ్యక్తికి కొబ్బరికాయలు ఒక ఫంక్షన్ కోసం అలంకరణకు మాత్రమే అవసరమయ్యాయి, వినియోగం కోసం కాదు, కానీ దుకాణదారుడు నిరాకరించాడు. సంబంధాల వ్యాపారంలో మునిగి, మనం తరచుగా దుకాణదారుడిలా ప్రవర్తిస్తాము. మనం ఇచ్చే ప్రతిదానికీ ప్రతిఫలంగా ఏదో ఒకటి కావాలి – ప్రేమకు బదులుగా ప్రేమ, సంతోషానికి బదులుగా సంతోషం. అవతలి వ్యక్తి నుండి మనం కోరుకున్నది వారు తిరిగి ఇవ్వలేనప్పుడు, మనం బాధపడతాము. ఆ బాధ మనం వారికి ప్రసరించే మన ఓదార్పు సానుకూల శక్తిని అడ్డుకుంటుంది.  ఆశించడం మరియు కోరుకోవడం మనం సాధారణంగా ఇతరులకు ప్రసరించే మరొక ఎనర్జీ. కొన్నిసార్లు మనం శాంతి, ప్రేమ మరియు గౌరవం కోసం అక్షరాలా వేడుకుంటాము. వేర్వేరు సంస్కారాలు, వేర్వేరు జీవిత పరిస్థితులు మరియు వేర్వేరు ప్రాధాన్యతలు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ మనకు అవసరమైన వాటిని అందించలేరు. తాదాత్మ్యంతో అర్థం చేసుకుంటూ మనం అడగడం నుండి ఇవ్వడానికి మారుదాం.

 

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »