Hin

9th feb 2025 soul sustenance telugu

February 9, 2025

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు

వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు లేదా సోదరుడు లేదా సోదరి. అటువంటి సమయాల్లో మనం వారి స్వభావానికి అనుగుణంగా మారాలి. సర్దుబాటు అనేది వారి పట్ల మన ఆలోచనల గురించి, కేవలం వారితో మన మాటలు లేదా మన ప్రవర్తన గురించి కాదు. మనం వారి స్వభావాన్ని అంగీకరించాలి, వారి గురించి ప్రశ్నించకూడదు లేదా కలత చెందకూడదు. ఇంట్లో ఉన్న వ్యక్తి చాలా అహంభావి కావచ్చు, వారిని సంతోషపెట్టడం కష్టంగా ఉండవచ్చు. మనం వారికి సాధ్యమైనంత ప్రేమ మరియు గౌరవాన్ని ఇస్తాము, కానీ ఆ వ్యక్తి అదే సానుకూల భావోద్వేగాలను మనకు తిరిగి ఇవ్వకపోవచ్చు.  ప్రతి విజయవంతమైన పనికి ప్రశంసలు ఆశిస్తూ మీ కార్యాలయంలో ఒక సహోద్యోగి ఉండవచ్చు. మీరు వారిని ప్రశంసించిన రోజు, వారు మీతో మంచిగా ఉంటారు. మీరు వారి తప్పును ఎత్తి చూపిన రోజు వారు మీ పట్ల ప్రతికూలంగా మారుతారు. మీరు వారిని ప్రశంసించడం మానేస్తే లేదా వారి ముందు మరొకరిని ప్రశంసిస్తే, వారు నిరుత్సాహపడవచ్చు.

 

కొంత మంది ఇలాగే ఉంటారు. వారు అరుదుగా ఇస్తారు కానీ ఇతరుల నుండి ఎమోషనల్ గా ప్రశాంతంగా, దృఢంగా ఉండటానికి నిరంతరం కోరుతూ ఉంటారు. అటువంటి సంబంధం యొక్క బలం మరియు నాణ్యత వారికి సరైన శక్తిని అందించే మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇవ్వడం కొనసాగించడానికి శక్తిని ఎలా పొందాలి? సానుకూల ఆధ్యాత్మిక శక్తి యొక్క స్థిరమైన ఉన్నత మూలం అయిన భగవంతుడి నుండి మనం ఎల్లప్పుడూ మనల్ని నింపుకోవచ్చు, వారే మనకు అపరిమితమైన ఎమోషనల్ ఓదార్పును మరియు బలాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. భగవంతుడికి ఒకే ఒక ఉద్దేశం ఉంది – వారికి ఉన్న ప్రతిదీ, ప్రతి గుణం మరియు మనకు అవసరమైన ప్రతి శక్తితో మనల్ని నింపడం. మనం వారితో కనెక్ట్ అయ్యి వారి నుండి స్వీకరించడం ప్రారంభించాలి. తద్వారా మనకు వ్యక్తుల నుండి ఏమీ అవసరం రాకుండా ఉండటమే కాకుండా వారికి ప్రసరించడానికి మన వద్ద ఎల్లప్పుడూ అవసరానికంటే ఎక్కువ  మంచితనం ఉంటుంది.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »