Hin

10th feb 2025 soul sustenance telugu

February 10, 2025

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 3)

మీ మంచితనాన్ని ఉపయోగించుకోండి లేదంటే కోల్పోతారు 

వారి సానుకూల శక్తులను ఉన్నతొన్నతమైన మూలం లేదా భగవంతుడు నింపే వ్యక్తులకు ఇచ్చే వ్యక్తిత్వం సహజంగా వస్తుంది. లేకపోతే ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇతరులకు సేవ చేయడమే జీవిత లక్ష్యంగా ఉన్న వ్యక్తులు ఉంటారు. అలా చేస్తున్నప్పుడు వారు తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను వదులుకోరు. తమ పాత్రలన్నింటినీ నిర్వహించడంతో పాటు, వారు తమ ప్రేమను, శ్రద్ధను యథాతథంగా ఉంచుకుంటారు. వారి ప్రతి ఆలోచన, మాట మరియు హృదయపూర్వకమైన సంజ్ఞ ద్వారా ప్రేమ నిరంతరం ప్రవహిస్తుంది.


వారు అంటారు – మీరు పొందాలనుకున్నది ఇవ్వండి. ప్రేమ కావాలా? ఇతరులను ప్రేమించండి. ప్రశంసలు కావాలా? ఇతరులను మెచ్చుకోండి. ఎందుకంటే మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ ప్రేమ మరియు ప్రశంసల శక్తిని పొందిన మొదటి వ్యక్తులుగా మనమే అవుతాము. మనమందరం ఇచ్చే శక్తిని ప్రయోగించవచ్చు. మనకు జీవితంలో ఏదైనా సమస్య ఉన్నప్పటికీ, మన అహం మనల్ని ఆపినప్పటికీ, ఇతరులు దానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చినప్పటికీ, మన మంచితనాన్ని ఇతరులకు ఇవ్వడానికి మరియు ప్రసరించడానికి మనం ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రేమతో, ఆనందంతో సేవ చేస్తూ మన జీవితమంతా గడపవచ్చు. మనతో ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు లేదా కోపదారి వ్యక్తిని సహించినప్పుడు, ఆ క్షణాల్లో వారి దెగ్గర లేనిది మనం వారికీ ఇస్తాము. ఆ శక్తి వారికి ఉపశమనం కలిగించి, మనల్ని శక్తివంతం చేస్తుంది. ఇది స్వయానికి అవసరమైనప్పుడు మరియు సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. మన మంచితనాన్ని ఉపయోగించనప్పుడు, మనం దానిని కోల్పోతాము. ప్రపంచం నేడు శాంతి మరియు శక్తిని ఇచ్చేవారి కోసం చూస్తోంది. కేవలం మౌనంగా ఉన్నా కూడా మనం శాంతిని ఇవ్వగలం. నిశ్శబ్దం అంటే మాట్లాడకపోవడం కాదు, దాని అర్థం మనస్సులో నిశ్శబ్దం – అనవసరమైన మరియు తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండటం. మరింత సానుకూలత ఉన్న కొన్ని ఆలోచనలు చేసే వ్యక్తి ఆటోమేటిక్ గా శాంతి శక్తిని ఇతరులకు ప్రసారం చేస్తాడు. దృఢ సంకల్పంతో మన వంతు కృషి చేయడం ద్వారా మనం ఇతరులకు శక్తిని ఇవ్వగలం. వారు తమ వంతు కృషి చేయడానికి ప్రేరణ పొందుతూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటారు. ఆత్మ యొక్క  అసలైన సుగుణాలను మరియు అంతర్గత శక్తులను ఉపయోగించినప్పుడు మనం ఇతరులకు శక్తి స్తంభంగా అవ్వచ్చు. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని మరింతగా పెంచుకొంటూ, బేషరతుగా మంచిని ఇచ్చేవారిగా ఉందాం.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »