Hin

ఇతరులకు పేర్లు పెట్టకండి, వారిని గౌరవించండి

January 22, 2024

ఇతరులకు పేర్లు పెట్టకండి, వారిని గౌరవించండి

మీరు ఎవరినైనా కలుసుకున్నప్పుడు, ఆ కొద్ది సమయంలోనే  వారిపై ఒక అభిప్రాయానికి వస్తారా? మీరు ఆ వ్యక్తిని ప్రశాంతంగా ఉన్నారు, అహంకారిగా, సన్నగా ఉన్నారు , నిజాయితీ లేని వ్యక్తిగా, తెలివైన వ్యక్తిగా ఇలా రకరకాలుగా పేర్లు పెడుతున్నారా? నేటి సమాజం ప్రతి ఒక్కరిపై ప్రతికూలమైన పేర్లను  చాలా త్వరగా పెట్టాలని పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రమాదం ఏమిటంటే అందరూ వారు స్వీకరించే ప్రతికూల పేర్లతో  జీవించడం ప్రారంభిస్తారు. పేర్ల లోని శక్తి వారికి ప్రసరిస్తుంది మరియు వారిలో నిర్దిష్ట ప్రవర్తన లేదా అలవాటును మరింత ప్రేరేపిస్తుంది. ఉదాహరణకి, మనం ఒకరిని నిజాయితీ లేని వ్యక్తి అని పదేపదే పిలుస్తూ ఉంటే , మనం వారిలో అసత్యాన్ని బలపరుస్తాము. ప్రతి ఒక్కరికీ స్వయాన్ని స్వచ్ఛమైన, పరిపూర్ణమైన వ్యక్తులుగా చూడగలిగే అధికారాన్ని అందరికీ అందజేద్దాం. లేదంటే మనం వారిని మనం పెట్టే పేర్ల ద్వారానే చూస్తాము. క్రమంగా మనం కూడా ఆ పేరుని మనదిగా చేసుకుంటాము. ప్రతి ఒక్కరిలో మెచ్చుకోదగిన లక్షణాలు ఉంటాయి. వాటిపై దృష్టి కేంద్రీకరించడం, వాటిని పెంచడం మరియు సానుకూల పేర్లను పెట్టడం వారిని ఉద్ధరించడమే కాకుండా మన ఆలోచనా ప్రమాణాలను కూడా పెంచుతాయి.

మనం ఒక రోజులో చూసినట్లయితే, ఎన్ని సార్లు ఇతరులకు తీర్పు చెప్పడం, పేర్లు పెట్టడం, విమర్శించడం, పోల్చడం లేదా వారు చేసే వాటిని అంచనా వేయడం వంటి వాటిని చేస్తున్నామో వాటి  సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా అతను సోమరి, ఆమె అహంకారి, ఆ ప్రదేశం బోరింగ్ గా వుంది  అని అంటూ ఉంటాము…కొన్నిసార్లు మనకు తెలియకుండానే అది చాలా సహజంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇలాంటి ప్రవర్తనను నేను నిజమే మాట్లాడాను, వారు ఇలానే ఉంటారు… అని సమర్ధించుకుంటాము. అది నిజమే కావొచ్చు కానీ ఆ వ్యక్తిని తక్కువగా చూపించడం ఎందుకు? దానికి బదులు మనపై మనం దృష్టి పెడదాము. ఈనాడు వివిధ రకాల మీడియా ద్వారా వ్యక్తుల గురించి, విషయాల పట్ల  పక్షపాత అభిప్రాయాలను వ్యాప్తి చేస్తున్నారు, వాటిని ఆ విధంగా గ్రహించేలా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు.  ప్రతికూల నిర్ణయాలు మరియు పేర్లు పెట్టడం  ద్వారా, మనలోని దయా భావనను తగ్గించుకోవడంతో పాటు మన అంతర్గత శక్తిని కూడా క్షీణింపజేస్తాము. ఎవరి గురించైనా మాట్లాడాలంటే వారి సద్గుణాలు మరియు విలువలను హైలైట్ చేసి ప్రచారం చేద్దాం. ఇతరులను విమర్శించకండి మరియు వారి నిర్ణయాలకు ప్రభావితం అవ్వకండి. ఇది మీకు రక్షణ మరియు ఇతరులకు సాధికారత.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th july 2024 soul sustenance telugu

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 3)

మన అసలైన మంచితన స్థితికి తిరిగి రావాలంటే, మనం ఆధ్యాత్మిక శక్తి మరియు సానుకూలత యొక్క ఉన్నత మూలం వైపు చూడాలి. ఇతరుల నుండి ప్రేమ, ఆనందం కోసం అడగడం అనేది కస్తూరి జింక

Read More »
17th july 2024 soul sustenance telugu

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 2)

మన వ్యక్తిత్వంలోని ఉన్న మంచితనం మన నిజ స్వరూపం, మన తప్పుడు లేదా ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాలు పొందబడ్డాయి. నిజానికి తన జీవితమంతా చెడుగా ఉన్న వ్యక్తి వాస్తవానికి చాలా మంచి వారు మరియు

Read More »
16th july 2024 soul sustenance telugu

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 1)

మన జీవితంలో చాలా ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన అంశం మన చర్యలలోని ప్రతి ఆలోచనను జీవించడం. “మీరు బోధించేదాన్ని ఆచరించండి” అని సాధారణంగా అంటూఉంటాము. మరో మాటలో చెప్పాలంటే, మీకు చాలా ఆదర్శవంతమైన ఆలోచనలు

Read More »