Hin

17th sep 2024 soul sustenance telugu

September 17, 2024

ఇతరులను అనుమానించడం ఆపండి, వారిని నమ్మడం ప్రారంభించండి

మనలో కొంతమందికి మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి గురించి మనకున్న సందేహాలు వారితో కంటే కూడా మన అలవాటులతో ఎక్కువ సంబంధించబడి ఉంటాయి. మన అనారోగ్యకరమైన సందేహాలు, అభద్రతలు, భయాలు మరియు ఆందోళనలు మన శాంతిని దూరం చేయడమే కాకుండా, ఆ వ్యక్తిని మన నుండి దూరం చేస్తాయి.

  1. మీరు ఎవరిపైనైనా విశ్వాసాన్ని ఉంచినప్పుడు వారిని ఎల్లప్పుడూ నమ్మగలరని మీకు సహజంగానే అనిపిస్తుందా? అయినప్పటికీ, వారి ఉద్దేశం, స్థోమత లేదా సామర్థ్యాన్ని అనుమానించడానికి మీకు ఏదో ఒక కారణం కనిపిస్తుందా? ఆ సందేహం మీ సంబంధం యొక్క పునాదిని ఎలా కదిలిస్తుందో మీరు గ్రహించారా?

2 . ప్రతి బంధం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని విశ్వసిస్తామని అంటాము, కానీ మనకు మన స్వంత సందేహాలు ఉంటాయి. ఈ అనుమానం మనం పంచుకునే బంధాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, ఎందుకంటే అనుమానం  పరస్పర గౌరవం, అంగీకారం మరియు ప్రేమ ప్రవహించకుండా అడ్డుకుంటుంది.

  1. వ్యక్తులు వేరు వేరు వ్యక్తిత్వాలను మరియు వేరు వేరు ప్రవర్తనలను కలిగి ఉంటారు, కాబట్టి అవి ఎల్లప్పుడూ మన మార్గంగా ఉండవు. కానీ వ్యక్తులు ఏమి చేస్తారు లేదా వారు ఎలా ప్రవర్తిస్తారు అనేదానిపై మన నమ్మకం స్వతంత్రంగా ఉండాలి. వారు తప్పు చేసినా, వారిని బేషరతుగా విశ్వసిద్దాం , ఎందుకంటే అది వారికి సరైన పనులు చేయడానికి అధికారం ఇస్తుంది.
  2. మీరు వారిని పూర్తిగా విశ్వసిస్తున్నారని మీకు మరియు ఇతరులకు ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపండి. మీకు మీరు గుర్తు చేసుకోండి-నమ్మకం అనేది నా సహజ స్వభావం. ప్రతి ఒక్కరినీ విశ్వసించడం నాకు సౌకర్యంగా ఉంటుంది మరియు వ్యక్తులను నమ్మదగినవారిగా చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »
9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »