Hin

23rd may 2025 soul sustenance telugu

May 23, 2025

ఇతరులను అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి

మన రోజువారీ పరస్పర చర్యలు ఎక్కువగా అవతలి వ్యక్తి యొక్క ఉద్దేశం, మానసిక స్థితి, వైఖరి మరియు ప్రవర్తనను అంచనా వేసే మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. మనము మన ప్రతిస్పందనలను కూడా అదే విధంగా సవరిస్తాము. కానీ ఇతరులను అర్థం చేసుకోవడం సులభం కాదని తెలుసుకుంటాము. మనల్ని మనం అర్థం చేసుకునే స్థాయి అనేది ఇతరులను అర్థం చేసుకోగల మన సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులతో మన సంబంధం ఎంత బాగున్నప్పటికీ, కొన్నిసార్లు వారి ప్రవర్తన ఊహించలేనిదిగా అనిపిస్తుంది. వారి ఆలోచనా విధానం, ఎంపికలు మరియు ప్రతిస్పందనలను మనం అర్థం చేసుకోలేమని మనము భావిస్తాము. మనల్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాము అనే విషయం, ఇతరులను అర్థం చేసుకోగల మన సామర్థ్యంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.

ఈ క్రింది చర్యలు మీ గురించి మరింత అవగాహన పొందడానికి మీకు సహాయపడతాయి, తద్వారా మీరు ఇతరులతో బాగా కనెక్ట్ అవ్వవచ్చు –

  1. ప్రతిరోజూ మీతో మీరు కొన్ని నిమిషాలు గడపండి. మీ గురించి మీరు కలిగి ఉన్న పాజిటివ్ మరియు నెగటివ్ అభిప్రాయాలను చెక్ చేయండి. ప్రతి విమర్శనాత్మక ఆలోచనను ప్రేమగా మార్చండి.
  2. మీరు ఎలా భావిస్తారు అనేదానికి వ్యక్తులు మరియు పరిస్థితులు బాధ్యత వహించవని గుర్తుంచుకోండి. అవి ఒక ఉద్దీపన మాత్రమే, మీ ప్రతిస్పందనలు అనేవి మీరు ఎంచుకున్న మరియు సృష్టించే ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తన మాత్రమే.
  3. ఇతరులు వారి అలవాట్లు మరియు వ్యక్తిత్వాలకు మాత్రమే బాధితులు అవుతారు. వారు తప్పు చేసినా, అది వారి బాధ వల్లనే. ఈ జ్ఞానం మీకు వారిని అర్థం చేసుకోవడానికి మరియు సానుభూతితో ఉండటానికి సహాయపడుతుంది.
  4. అపార్థాలు ఉంటే, ఆ వ్యక్తి పట్ల మీ ఆలోచనలను మార్చుకోండి. కరుణను సృష్టించడం సంఘర్షణలను కరిగిస్తుంది.
  5. మనమందరం విభిన్న అలవాట్లు మరియు వ్యక్తిత్వాలను కలిగి ఉంటాము. ఏదైనా మార్పును తీసుకురావడం అంటే మనం అనేక జీవితకాలాల్లో ఏర్పడిన పాత పద్ధతులకు, పాత సంస్కారాలకు వ్యతిరేకంగా వెళ్తున్నామని అర్ధం. మీకు మరియు ఇతరులకు సమయం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లను అర్థం చేసుకోండి. ఇది అభివృద్ధి మరియు సాధికారత యొక్క ప్రయాణం.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »