Hin

16th june 2025 soul sustenance telugu

June 16, 2025

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 1)

ప్రపంచ నాటకంలో మనం అనేక జన్మలలో అనేక రకాల వ్యక్తులను కలుస్తాం. ప్రతి జన్మలో వారి సౌరభం మరియు వారు ప్రసరించే వైబ్రేషన్లతో మనకు సంభంధం ఏర్పడుతుంది. అదే విధంగా, మన సౌరభం మరియు శక్తి కూడా వారితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఒక శక్తి మార్పిడి ప్రక్రియ. ఈ మార్పిడి అనేకసార్లు జరుగుతుంది ఎందుకంటే అనేక జన్మలలో ఉన్న సంబంధాలు కూడా చాలా ఉంటాయి. ఈ పరస్పర చర్యలలో శాంతి, ప్రేమ, ఆనందం వంటి పాజిటివ్ భావోద్వేగాలూ, కోపం, అహంకారం, అసక్తి, అసూయ, ద్వేషం వంటి నెగటివ్ భావోద్వేగాలూ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఈ శక్తి మార్పిడి మానవాత్మలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచంలోని ప్రకంపన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఆత్మలు అనేక జన్మలు తీసుకోవడం వలన వాటి నాణ్యత తగ్గింది, అలాగే ఈ శక్తి మార్పిడి యొక్క నాణ్యత కూడా తగ్గింది. అలాగే, అనేక ఆత్మల మధ్య నిరంతరం ప్రసరిస్తున్న ఈ ప్రతికూల శక్తులు ప్రపంచంలోని ఇతర ఆత్మలను కూడా ప్రభావితం చేస్తున్నాయి మరియు వారి భావోద్వేగాలలో, ప్రవర్తనలో వారిని దిగజారుస్తున్నాయి. దీన్ని సరిచేయడానికి కొన్ని మంచి మార్గాలు ఏమిటి? ఈ సందేశంలో చూద్దాం –

ఇతరులతో సంభాషించేటప్పుడు ఆత్మిక స్మృతి కలిగి ఉండండి

ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి భగవంతుడు మనకు నేర్పించే ఒక అందమైన మార్గం వారిని ఆత్మలుగా మరియు సర్వోన్నతుడైన తండ్రి లేదా భగవంతుడి పిల్లలుగా చూడటం. శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి, జ్ఞానం యొక్క వారి అందమైన మరియు అసలైన సంస్కారాలను చూడటానికి మరియు వారి ప్రస్తుత ప్రతికూల బలహీనతలను చూడకుండా ఉండటానికి ఈ సోదర దృష్టి మనకు సహాయపడుతుంది. మనం అలా చేసినప్పుడు, మనం వారికి ఆశీర్వాదాలను మరియు సానుకూల శక్తిని మాత్రమే ప్రసరింపజేస్తాము. అలాగే, మనం ఇతరులతో వారి ప్రత్యేకతల గురించి మాత్రమే మాట్లాడేలా చూసుకుంటాము. వారితో సంభాషించే సమయంలో ప్రేమ మరియు గౌరవాన్ని వారికి ఇస్తాము. వారి పట్ల ప్రేమ మరియు గౌరవాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తాము. ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఆశీర్వాదం తీసుకోవడం, శాంతి ఇవ్వడం అంటే శాంతిని పొందడం, ప్రేమ ఇవ్వడం అంటే ప్రేమను పొందడం, ఆనందాన్ని ఇవ్వడం అంటే ఆనందాన్ని పొందడం అని భగవంతుడు చెప్పారు. మనం ఇచ్చేది మనం తిరిగి పొందుతాము, ఇది మనకు మరియు వారికి మధ్య సానుకూల శక్తి మార్పిడిని సృష్టిస్తుంది మరియు ఇది ప్రపంచంలోని ఇతర ఆత్మలకు కూడా ప్రసరిస్తుంది. 

(సశేషం)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »