Hin

17th june 2025 soul sustenance telugu

June 17, 2025

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 2)

స్వీయ మార్పు కోసం స్వీయ బాధ్యత తీసుకోండి

శక్తి మార్పిడులు సాధారణంగా మనం స్వీయ మార్పు పట్ల ఎలా మన దృష్టికోణం ఉంచుతామో దానిపై ఆధారపడి ఉంటాయి. ఇతరులు మనకు మంచి మరియు సానుకూల శక్తిని పంపాలని మనం కోరుకుంటే, మనం తక్కువ  బలహీనతలతో మంచి మరియు పరిపూర్ణమైన ఆత్మలుగా ఉండాలి. ఎందుకంటే ఇతరులు మనల్ని నిరంతరం పరస్పర చర్యలలో చూస్తారు మరియు వారు మనలో లోపాలను చూసినప్పుడు, వారు మనకు ప్రతికూల శక్తిని మరింత సులభంగా పంపుతారు. మనం పరిపూర్ణంగా మారితే, వారు కూడా తమను తాము మరింత సరళంగా మార్చుకొని మనతో ఉన్న ఏ రకమైన తేడాలకు అయినా అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటారు. ఈ విధంగా శక్తి మార్పిడి మెరుగుపడుతుంది. కానీ దీని కోసం మన అహంకారాన్ని త్యాగం చేయడం, మనకు తగిన విధంగా మనల్ని మనం మలుచుకునే శక్తి అవసరం. అలాగే, ప్రతి వ్యక్తికి తాను తానులాగా ఉండేందుకు అవకాశం ఇచ్చే కళను నేర్చుకోవాలి. లేదంటే, వారు లోపలికి మూసుకుపోయి, మన నుండి వచ్చే సానుకూల శక్తిని స్వీకరించకుండా తమను తాము దూరం చేసుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది — అది ఏమిటంటే, ఇతరుల పట్ల క్షమాభావాన్ని కలిగి ఉంటూ చిన్నచిన్న పరిస్థితుల వల్ల మన మధ్య నెగటివ్ శక్తి మార్పిడులు జరగకుండా చూసుకోవటం ద్వారా మనం ఇతరుల హృదయాలను జాగ్రత్తగా చూసుకోగలుగుతాం.

ఇతరులను అర్థం చేసుకుని, వారికి సహానుభూతితో స్పందించండి

ఒక ఆధ్యాత్మిక మేధావి, ఇతరులను అర్థం చేసుకుని వారికి సహానుభూతితో స్పందించటం. ద్వారా తమ మధ్య శక్తి మార్పిడిని మెరుగుపరుస్తారు. వారు ఇతరులను కేవలం పైపైన చూడరు లేదా దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. ప్రతికూల శక్తి మార్పిడికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి. అలాగే, వారి అవగాహన ఆధారంగా వారు ఇతరులను సంతృప్తి పరచడానికి నిజాయితీగా ప్రయత్నిస్తారు. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే, వారు ఒకరితో ఒకరు నిరంతరం సానుకూలంగా ఉంటారు. ఇక వారు సానుకూలంగా ఉన్నప్పుడు, వారు ఒకరికొకరు అన్ని సమయాలలో మంచితనాన్ని ప్రసరింపజేస్తూ శాంతి, ప్రేమ, ఆనందం యొక్క వాతావరణాన్ని సృష్టిస్తారు, ఇది ఇతరులకు నిరంతరం ప్రసరిస్తుంది. ఒకరినొకరు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో, అంత ఎక్కువ సానుకూల శక్తి పంచుకోబడుతుంది మరియు ప్రసరిస్తుంది. ఇది అటువంటి ఆత్మలు చేసే నిరంతర సేవ మరియు ఇది ఇతరులను కూడా అదే విధంగా చేయమని ప్రేరేపిస్తుంది.

(సశేషం)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »