Hin

22nd november 2024 soul sustenance telugu

November 22, 2024

ఇతరులు ఏమంటారు?

మనలో చాలా మంది కేవలం ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఆందోళన చెందుతూ మన జీవితంలో ఎదో ఒకటి చేసిన లేదా చేయని దశలను ఎదుర్కొన్నాము. మనల్ని ఆ విధంగా అంగీకరించడంలో నిరాకరించినప్పటికీ, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండటం చాలా విలువైనది. కానీ మన జీవితం ఇతరుల ఆమోదంతో నిర్వహించబడితే, మనం బాధితుల వలె జీవిస్తాము, సమాజ అభిప్రాయాల క్రింద నలిగిపోతాము. మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటూ, మనకు సరైనదిగా, సౌకర్యవంతంగా అనిపించేది చేయడం గొప్ప బలానికి చిహ్నం. కానీ తరచుగా మన నిర్ణయాలు ఇతరుల ఆమోదంపై ఆధారపడి ఉంటాయి. మన ప్రాధాన్యత, విలువలు లేదా సామర్థ్యానికి అనుగుణంగా లేని కొన్ని పనులను కూడా చేస్తాము.

 

ఇతరుల ఆమోదం అవసరం లేకుండా మీ ప్రకారంగా ఉండటానికి వీటిని అనుసరించండి –

  1. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అంగీకరించండి మరియు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి, అప్పుడు మీ ఆనందం ఇతరుల ఆమోదం మీద ఆధారపడి ఉండదు.
  2. తప్పు, ఒప్పు, విలువలు మరియు సూత్రాల గురించి మీ స్వంత నిర్వచనాలను రూపొందించుకొని మీ ప్రాధాన్యతలు, ఎంపికలు, నిర్ణయాలు, అలవాట్లు వాటికి అనుగుణంగా ఉంచుకోండి.
  3. మీరు సరైనది చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతరుల ఆమోదాన్ని పొందకపోవడం మిమ్మల్ని తప్పు చేయదు. మీ సహచరుల వద్ద ఖరీదైన ఫోన్ ఉండవచ్చు, కానీ తక్కువ ఖరీదైన మోడల్ కొనుగోలు చేయడం గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
  4. మీరు ఇతరులను సంతోషపెట్టడానికి ఏదైనా చేయాలని ఆ పని చేసి ఉండవచ్చు కానీ ఒత్తిడి, ఆందోళన మరియు అయిష్టత ఆలోచనలు వచ్చి ఉంటాయి.

 

మీ నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి మీ మనస్సుకు శిక్షణ ఇచ్చి సామాజిక ఒత్తిళ్లను విస్మరించండి. ఇతరుల ఆమోదం గురించి చింతించటం మానేసి ప్రామాణికంగా ఉండండి. ఈ ధృవీకరణను ప్రతిరోజూ సవరించుకుందాం –

నేను ఒక శక్తివంతమైన వ్యక్తిని… నాకు,  నా చుట్టూ ఉన్నవారికి ఏది సరైనదో అది నేను ఎంచుకుంటాను. నాకు తప్పు ఒప్పుల గురించి నా స్వంత నిర్వచనాలు ఉన్నాయి. తోటివారి ఒత్తిడి… ప్రజాభిప్రాయం… నన్ను తాకడం లేదు… నేను తీసుకునే ప్రతి నిర్ణయం నా ఎంపిక. అందరూ నన్ను ఆమోదించవచ్చు… ఆమోదించకపోవచ్చు…. నేను ఆమోదాన్ని కోరుకోవడం లేదు… నాకు ప్రశంసలు అవసరం లేదు… నాకు ఏది సరైనదో దాన్ని నేను ఎంచుకుంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »