Hin

25th jan 2025 soul sustenance telugu

January 25, 2025

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే ఆందోళనను అధిగమించడం (పార్ట్ 1)

మనమందరం సాధారణంగా మన రోజువారీ జీవితంలో మన కుటుంబంలో, మన కార్యాలయంలో మరియు మన సామాజిక పరస్పర చర్యలలో అనేక వ్యక్తులను కలుస్తాము. వారందరూ మన గురించి వేర్వేరు అవగాహనలు, అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారు వారి మనస్సులో పెట్టుకున్న ఈ ఆలోచనలలో కొన్ని మన గురించి మంచివి కావచ్చు, మరి కొన్ని ప్రతికూలమైనవి లేదా మనం వినడానికి, తెలుసుకోవడానికి అసౌకర్యమైనవి కావచ్చు. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఈ భయాన్ని, ఆందోళనను మనం ఎలా అధిగమించగలం? ఈ సందేశంలో అర్థం చేసుకుందాం –

 

  1. మీరు ప్రత్యేకమైన ఆత్మ అని, భగవంతునికి అందమైన బిడ్డ అని ప్రతిరోజూ మీరే చెప్పుకోండి – ప్రతి ఉదయం మీరు మేల్కొన్న వెంటనే, మీ గురించి కొన్ని ఉన్నతమైన ఆలోచనలతో ఉదయం ప్రారంభించండి. మిమ్మల్ని మీరు సూక్ష్మంగా ప్రశంసించుకొని జీవితంలో మీ ప్రత్యేకతల గురించి, విజయాల గురించి ఆలోచించండి. మీరు ఎంత ఎక్కువ ఇలా చేస్తే, అంత ఎక్కువగా మీరు ప్రతి ఒక్కరి నుండి, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేదాని నుండి నిర్లిప్తం(డిట్టాచ్) అవుతారు. మీరు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు, కానీ అదే సమయంలో, మీరు మిమ్మల్ని కూడా అర్థం చేసుకొని గౌరవిస్తారు. ముఖ్యంగా ఇతరులు తప్పుగా ఆలోచిస్తునపుడు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆందోళన చెందరు. అదే సమయంలో, మీ బలహీనతల గురించి లేదా కొంత మెరుగుదల అవసరమని మీరు భావించే మీ కొన్ని చర్యల గురించి లేదా మీ గురించి వారు ఏదైనా అనుకుంటే, మీరు వారి అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇచ్చి మీలో ఆ మార్పులను తీసుకువస్తారు. 
  1. అంతర్గతంగా ప్రతిబింబించడానికి రోజులో స్వల్ప విరామాలు తీసుకోండి-ఈ రోజుల్లో మానవ జీవితాల్లో చాలా సాధారణ అంశం బాహ్యముకత , రోజంతా ఇతరులతో కనెక్ట్ అవ్వడం. చాలా మంది వ్యక్తులు ఆంతరిక ప్రయాణానికి మరియు భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి సమయం కేటాయించరు, ఇది వారిని మానసికంగా బలహీనపరుస్తుంది.  అందుకే ఇతరులు వారి గురించి మాట్లాడటం లేదా వారి గురించి చర్చించడం వల్ల వారు ప్రభావితమవుతారు. 

భగవంతుడు మనల్ని వారితో కనెక్ట్ అవ్వమని, వారిని  ప్రేమతో చక్కగా గుర్తుంచుకోవాలని చెబుతారు. మనం ఎంత ఎక్కువ గుర్తు చేస్తే, ఇతరులు మనం చేసే ప్రతిదానికీ మనల్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ప్రేమను, గౌరవాన్ని, మద్దతును మరియు సహకారాన్ని మనకు అందిస్తారు ఎందుకంటే భగవంతుడు ఈ ప్రపంచ కుటుంబం యొక్క మొత్తం వృక్షానికి విత్తనం. మనం భగవంతుడిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో మరియు గౌరవిస్తామో, ఆ ప్రకంపనలు మొత్తం చెట్టుకు మరియు చెట్టు యొక్క ప్రతి ఆకుకు ప్రసరిస్తాయి లేదా మరో మాటలో చెప్పాలంటే, ప్రతి మానవ ఆత్మ ప్రతి దశలో మనకు అదే అందిస్తుంది, మన కోసం సానుకూలంగా, చక్కగా ఆలోచిస్తుంది మరియు వారు కొన్నిసార్లు మన కోసం ప్రతికూలంగా ఆలోచిస్తే, మన సానుకూల ప్రకంపనలతో వారి ఆలోచనను మార్చగలుగుతాము. 

(సశేషం…) 

 

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »