Hin

26th jan 2025 soul sustenance telugu

January 26, 2025

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే ఆందోళనను అధిగమించడం (పార్ట్ 2)

  1. సానుకూల ఆలోచనలు మరియు సానుకూల విధిని సృష్టించడంపై దృష్టి పెట్టండి – మీ సానుకూల విధిని రూపొందించడం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క చాలా ముఖ్యమైన కోణం, అంటే అన్ని రకాల అంతర్గత మరియు బాహ్య ప్రాప్తులతో నిండిన జీవితాన్ని సృష్టించడం. మనం మన ఆలోచనలను మార్చుకుని, వాటిని సానుకూలంగా, శక్తివంతంగా మరియు అందమైన లక్షణాలు, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆధారంగా చేసినప్పుడు, మన విధి మారుతుంది. జీవితంలోని ఈ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్న ఆత్మ ఎల్లప్పుడూ తన మీదనే దృష్టి కేంద్రీకరించి, ప్రతిరోజూ భగవంతుడు మార్గనిర్దేశం చేసినట్లుగా మరియు సరిగ్గా ప్రతిదీ చేయాలని నమ్ముతుంది, తద్వారా ఈ ప్రయోజనం సాధించబడుతుంది. అటువంటి జ్ఞానోదయమైన ఆత్మ ఇతరులు వారి గురించి ఏమి చెబుతున్నారో, ఆలోచిస్తున్నారో అనే దానిపై అస్సలు దృష్టి పెట్టరు, ఆలా చేయడం వల్ల సమయం మరియు ఆలోచనా శక్తి వృధా అవుతుంది అని భావిస్తారు. 

 

  1. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచి మీ సంబంధాల భారాన్ని భగవంతునికి వదిలేయండి – మీరు జీవిత మార్గంలో నడుస్తున్నప్పుడు, చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే మీ సానుకూల స్వభావం మరియు జీవనశైలి ద్వారా సంతృప్తిగా ఉంటూ, ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచడం. అదే సమయంలో, మనం సంభాషించే కొంతమంది వ్యక్తులు మనం ఆశించినంత లేదా కోరుకున్నంత సంతృప్తి చెందరని మనకు తెలుసు. దీనికి కారణం వారి సంస్కారాలు, ఆలోచనా విధానాలు లేదా కొన్నిసార్లు మనకు అనేక లక్షణాలు ఉన్నప్పటికీ పరిపూర్ణత లేకపోవడం కూడా కావచ్చు. కొంతమంది ఆత్మలతో ఈ జన్మ లేదా కొన్ని గత జన్మల యొక్క ప్రతికూల కర్మల ఖాతాలు ఉన్నందున కూడా ఇది జరుగుతుంది, వారు మనల్ని ఇష్టపడనందున వారు మనల్ని గౌరవించకపోవచ్చు. ఈ విషయాలన్నింటిలో, మన గురించి వారికి ఉన్న ప్రతికూల లేదా అనవసరమైన ఆలోచనల భారాన్ని మనం భగవంతునికి వదిలివేయాలి. మనం ఎంత ఎక్కువ అలా చేస్తే, అంత ఎక్కువ సానుకూలంగా ఉంటాము మరియు వారిని సంతృప్తి పరచడంలో భగవంతుడు కూడా మనకు వివిధ రకాలుగా సహాయం చేస్తాడు.

5. ఇతరులకు సేవ చేయడంలో, అందరి ఆశీర్వాదాలు తీసుకోవడంలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి – మీరు చాలా మందితో సంభాషించేటప్పుడు సేవలో బిజీగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భగవంతుని జ్ఞానం, సుగుణాలు మరియు శక్తులు అవసరం. ఇతరులు మీ గురించి మంచిగా ఆలోచించాలని చింతించి, ఆశించే బదులు, మన ఆలోచనలు, మాటలు, చర్యలు మరియు వైబ్రేషన్ల ద్వారా మనం భగవంతుని నుండి పొందిన వాటితో నిరంతరం వారికి సేవ చేయవచ్చు. ఈ విధంగా చేస్తే మనం ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాము మరియు మనం అలా చేసినప్పుడు, ప్రతి ఒక్కరు వారి మనస్సులో మన గురించి ఏమి అనుకుంటున్నారో అని మనం మరచిపోతాము మరియు ప్రతి ఒక్కరినీ భగవంతుడు వారిని చూసే విధంగా, నిష్పాక్షికంగా మరియు ప్రేమపూర్వకంగా చూస్తాము.

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »