Hin

3rd feb 2024 soul sustenance telugu

February 3, 2024

ఇతరుల కోసం చింతించడం వారి పట్ల శ్రద్ధ చూపుతున్నట్టా ? (పార్ట్ 1)

బాల్యం నుండి ఆందోళన చెందడం అంటే శ్రద్ధ చూపడం, చింతించడం అంటే శ్రద్ధ చూపడం అని తప్పుగా నమ్మాం. మన బాల్యం లో తల్లిదండ్రులతో పెరుగుతాము. మనం పుట్టిన వెంటనే, నిజానికి మనం పుట్టకముందే, తల్లి కడుపులో ఉన్నప్పుడే, తరువాత వారితో ఉన్నప్పుడు వారు తమ ఆలోచనలు, పదాలు మరియు చర్యల ద్వారా ఈ నమ్మకాన్ని ప్రసరింప చేస్తారు. ఆత్మలైన మనం భావాలను ప్రసరింప చేయటమే కాకుండా వాటిని గ్రహిస్తాము కూడా. మనం పెరిగేకొద్దీ, మన స్నేహితులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి మొదలైన వారితో సహా మనం కలిసే ఉన్న ప్రతి ఒక్కరి నుండి ఈ తప్పుడు విశ్వాసం సూక్ష్మంగా మరియు శారీరక స్థాయిలో మనకు చేరి  నెమ్మదిగా మనం దీనిని అంగీకరించడం ప్రారంభిస్తాము. ఆ నమ్మకం పూర్తిగా నిజం అని భావించి మన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు కూడా ప్రసారం చేస్తాం. అందుకే ఎంతో కొంత ఈ నమ్మకం ప్రకారం జీవించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు. 

పైన పేర్కొన్న నమ్మకానికి మనమందరం సాధారణంగా మనం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి రావడానికి కొన్ని నిమిషాలు ఆలస్యం అయినప్పుడు చూస్తాము. ఇంటికి చేరుకున్న తర్వాత, మన కుటుంబ సభ్యులు మనం ఎక్కడ ఉన్నాము మరియు ఎందుకు కాల్ చేయలేదని చాలా ప్రశ్నలు అడుగుతారు; వారు ఆ సమయంలో చేసిన అనేక ప్రతికూల అంచనాల గురించి కూడా తెలియజేస్తారు. ఎందుకు? ఎందుకంటే వారు మన గురించి ఆందోళన చెందారు. వారు ఆందోళన చెందుతున్నారని మనం ఆశ్చర్యపోతాము, ఎందుకంటే అంత గట్టి కారణం వల్ల ఆలస్యం కాకపోవచ్చు కాని మేము మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నందున మేము మీ కోసం చింతిస్తున్నామని మన కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. కానీ చింతించడం అంటే పట్టించుకోవడం కాదు చింత అంటే భయం లేదా ఆందోళన, సంరక్షణ అంటే ప్రేమ లేదా పట్టించుకోవటం అనేవి రెండు వ్యతిరేక భావోద్వేగాలు, అవి ఒకే సమయంలో కలిసి ఉండజాలవు. 

రేపటి సందేశంలో, ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటంలో చింతించడం కంటే నిజమైన ప్రేమ ఎలా ప్రయోజనకరంగా ఉంటాయో మనం చూద్దాం

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »