Hin

4th feb 2024 soul sustenance telugu

February 4, 2024

ఇతరుల కోసం చింతించడం వారి పట్ల శ్రద్ధ చూపుతున్నట్టా ? (పార్ట్ 2)

మనమంతా సూక్ష్మ స్థాయిలో, అగోచరంగా ఒకరికొకరం జోడింపబడి ఉన్నాము, ఈ అదృశ్య రీతిలోనే మన మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. మనం ఇతరులకు శక్తిని పంపడమే కాకుండా ఇతరులు ప్రసరించే శక్తిని తీసుకుంటాము కూడా. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులలో ఇది సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణతో చెప్పగలం.

మీ అబ్బాయి క్లాస్ టీచర్ ఫోన్ చేసి స్కూల్ ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, మీ కొడుకు గాయపడ్డాడని చెప్పారనుకుందాం. ఆమె చింతించాల్సిన పని లేదని చెప్పి మీరు వచ్చి అతనిని స్కూల్ నుండి తీసుకొని వెళ్ళమని ఆమె చెప్పారు. ఈ సమయంలో మీ కొడుకు బహుశా భయం, ఒత్తిడి, ఆందోళన మరియు దుఃఖం యొక్క ప్రతికూల శక్తిని  ప్రసరింపజేస్తున్నాడు (అతను క్షేమంగా ఉన్నాడని ఉపాధ్యాయుడు మీకు తెలియచేసినప్పటికీ  అదే సమయంలో, అతను మీ ఆధ్యాత్మిక లేదా మానసిక శక్తిని కూడా పొందుతున్నాడు. మీరు అతనిని తీసుకురావడానికి అతని స్కూల్ కు డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో, మీరు తనకు దూరంగా ఉన్నందున అతను ఉన్న పరిస్థితి గురించి మీకు కొంత అవగాహన మాత్రమే ఉంటుంది. యదార్థ పరిస్థితి గురించి ఆలోచించడం ఊహించడమే అవుతుంది మరియు మీ మానసిక శక్తిని వృధా చేయడం అవుతుంది. మీరు ప్రతికూల ఊహలలో ఉండి, అంటే మీరు ఆందోళన చెంది భయపడుతూ ఉంటే, మీరు అతనికి అదే భయం యొక్క ప్రకంపనలను, ప్రతికూల శక్తిని పంపుతున్నారు, దానినే అతను తీసుకోబోతున్నాడు. ఆ ఆందోళన అతనికి ఏవిధంగానూ శక్తినివ్వకపోగా అతనిని బలహీనపరచి, మరియు మీ డ్రైవింగ్‌లో మిమల్ని భంగపరుస్తుంది. మీరు చింతించాల్సిన పని లేదని చెప్పబడింది, అయినా అతను కొంచెం కష్టమైన భావోద్వేగ పరిస్థితిలో ఉన్నాడని మీరు అనుకుంటారు. అసలు ఇప్పుడు అతనికి ఏం కావాలి?  మీరు పాఠశాలకు చేరుకోవడానికి, అతనికి సహాయాన్ని అందించడానికి కొంత సమయం తీసుకుంటారు కనుక అతనికి ఇప్పుడు మీ సూక్ష్మమైన సపోర్ట్ అవసరం. మీరు ఆందోళన లేదా సంరక్షణ అని తప్పుగా పిలవబడే భయం యొక్క మీ ప్రతికూల ప్రకంపనలా? లేదా మీ నిస్వార్ధ ప్రేమ, మీ శుభాశీస్సులా? దూరం నుండి అతనికి సహాయాన్ని ఇవ్వడానికి మీరు అతనికి ఏమి పంపుతారు? చింత ప్రకంపనలా లేక అతనికి మీరిచ్చే శుభాశీస్సులుగా ప్రేమ ప్రకంపనలా? మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రేమ ప్రకంపనలు మిమ్మల్ని సానుకూల స్థితిలో ఉంచుతాయి. అసలు, సంరక్షణ లేదా పట్టించుకోవటం అంటే ఏమిటి? సంరక్షణ అంటే మీరు మరొకరికి సహాయం చేయడానికి మీ సానుకూల అంతర్గత ఆధ్యాత్మిక కాంతిని పంపడం; ఆందోళన ఖచ్చితంగా అది కాదు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »
6th feb 2025 soul sustenance telugu

మనం స్వీయ నియంత్రణను ఎందుకు కోల్పోతున్నాము?

మనం ఎందుకు, ఎలా స్వీయ నియంత్రణను కోల్పోతామో అన్వేషిద్దాం. గాలిలోని కాలుష్య కారకాల గురించి మనకు తెలుసు, కానీ మరొక సూక్ష్మమైన మరియు కీలకమైన భాగం ఉంది, దానిని మనం చూడలేము కాని మనం

Read More »