Hin

5th august 2024 soul sustenance telugu

August 5, 2024

ఇతరుల నుండి బాధను గ్రహించవద్దు … ఆనందాన్ని ప్రసరింపజేయండి

ఎవరికీ బాధను లేదా విచారాన్ని ఎప్పుడూ ఇవ్వకూడదని, అది చెడు కర్మ అని మనకి ఎల్లప్పుడూ బోధించబదిండి. కాబట్టి మన చర్యలలో జాగ్రత్తగా ఉంటాము. కానీ ఇతరుల నుండి బాధను లేదా విచారాన్ని తీసుకోకుండా ఉండటం కూడా ఒక ముఖ్యమైన ప్రావీణ్యం. ఇతరుల బాధను గ్రహించడం దానిని ఇవ్వడంతో సమానంగా నష్టపరుస్తుంది. మీరు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు, ఉద్దేశపూర్వకంగా ఇతరులకు బాధ కలిగించరు. కానీ, మీకు తెలియకుండా ఇతరుల నుండి బాధను తీసుకున్నారా? అంటే, ఎవరైనా బాధపడటం చూసి మీరు బాధ పడతారా? లేదా మీరు ఆమోదించని విధంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా? ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యం, కానీ మనం ఎవరి బాధను స్వీకరించకపోవడం కూడా అంతే ముఖ్యం. మన చుట్టూ ఉన్నవారు మానసికంగా బాధపడుతున్నారు. వారు అసురక్షత, అసూయ, కోపం లేదా భయానికి గురి అవుతున్నారు. వారు తమ బాధను నయం చేసుకోనందున, వారు తమ ప్రవర్తనలతో ఈ బాధను మనకు ప్రసరింపజేస్తారు. వారు అనారోగ్యంతో ఉన్నారు మరియు ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయటం లేదు. వారి బాధను చూసి మనం బాధపడినా, వారి ప్రవర్తనలను ప్రశ్నించి, ప్రతిఘటించినా వారి బాధను మనం స్వీకరించినట్లే. మన బాధ్యత మానసికంగా అతీతంగా అయ్యి స్థిరంగా ఉండడం, వారిని అర్థం చేసుకోవడం. మనం వారిని అంగీకరిస్తూ సహాయపడదాం. బాధతో ఉన్న వారి భావోద్వేగం లో చిక్కుకునేందుకు బదులుగా శక్తివంతమైన సంరక్షకుడిగా అవ్వండి.

మీరు సంతోషకరమైన జీవి అని ప్రతిరోజూ గుర్తు చేసుకోండి. ప్రతిరోజు ప్రతి సన్నివేశంలో ప్రశాంతంగా మరియు తేలికగా ఉండండి. ఎవరి నుండి ఏదీ ఆశించకండి, ఆనందాన్ని వెతకకండి బదులుగా ఆనందాన్ని ప్రసరించే వారిగా అవ్వండి. మీ ప్రతి మాట మరియు ప్రవర్తన ఇతరులకు ఆశీర్వాదంగా ఉండనివ్వండి. ప్రతి వ్యక్తి తన స్వభావం ఆధారంగా తన పాత్రను పోషిస్తున్నారు. కొందరు గత మానసిక గాయం కారణంగా, కొందరు అనారోగ్యం కారణంగా, సంబంధంలో సమస్యలతో, పనిలో సమస్యలతో బాధను కలిగి ఉంటారు. వారందరూ బాధలో ఉన్నారు, వారి ప్రవర్తన వారి బాధను ప్రతిబింబిస్తుంది. నిర్లిప్త పరిశీలకుడిగా వారి చర్యలకు సాక్షి అవ్వండి. వారి బాధను గ్రహించి మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి, వారి బాధను ప్రశ్నించకండి. వారికి బాధను ఇవ్వవద్దు లేదా వారి బాధను తీసుకోవద్దు. వారి ఆలోచనా విధానాన్ని, వారి దృక్పథాన్ని, వారి బాధను అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని, అంగీకరించి, స్థిరంగా ఉంటూ ప్రతి సన్నివేశంలో సంతోషంగా ఉండండి. మీ ఆనంద వైబ్రేషన్లు వారికి చేరుకుంటూ మీ శక్తి వారిని నయం చేస్తుంది. ఇతరుల భావోద్వేగాలకు లోనవకుంటే మీ స్థిరత్వం వారికి స్వస్థతను ఇస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 1)

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »