Hin

2nd july 2024 soul sustenance telugu

July 2, 2024

ఇతరుల విజయం పై సంతోషించండి  

మనం ఒకరి బలహీనతలు లేదా వైఫల్యాల గురించి ఆలోచించినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, మనం వాటినే కొనసాగిస్తూ ఉంటాం. కానీ మనం వారి బలాలు లేదా విజయం గురించి మాట్లాడితే, వాటిని ఒకే వాక్యంలో ముగిస్తాం. నేటి డిజిటలైజ్డ్ ప్రపంచంలో, చాలా మంది కొన్ని శుభవార్తలు లేదా విజయాలను పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. మనం వారి పట్ల ఎంత సంతోషిస్తాము?

  1. ఒకరి విజయాన్ని ప్రశ్నించడం లేదా వారి పట్ల అసూయపడటం మన శక్తిని తగ్గిస్తుంది. మీరు ప్రశంసించబడకుండా ఇతరులు ప్రశంసించబడితే, మీ కంటే వేరొకరు మెరుగ్గా పనిచేస్తే – మీరు వారి పట్ల సంతోషంగా ఉన్నారా లేదా అసూయపడుతున్నారా? అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
  2. ఇతరులు మెరుగ్గా పనిచేసినప్పుడు మీరు ఏదైనా ప్రతికూలంగా భావిస్తే, అది అభద్రతకు సంకేతం. ఇది మెరుగ్గా పనిచేసేవాడు ఉన్నతమైనవాడనే తప్పుడు నమ్మకం నుండి పుడుతుంది. విజయం మరొకరిని మీ కంటే మంచి వ్యక్తిగా చేయదు. విజయం అనేది వారి కృషి, చిత్తశుద్ధి మరియు గుణాల ఫలితం. వారు పొందారు, మీరు కూడా పొందవచ్చు.
  3. మీ ఆలోచనను ఉన్నతంగా చేసుకోవడానికి ప్రతిరోజూ ధ్యానంతో మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి. పోటీ మరియు అసూయను సహజంగా చూసే ప్రపంచంలో, సహకారం మరియు ప్రశంసల శక్తిని సృష్టించి, అందరికీ ఆశీర్వాదాలను ప్రసరింపజేయండి. మీకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోండి. ఇతరులకు తెలిసిన దాని నుండి నేర్చుకోండి.
  4. వారి కృషిని మెచ్చుకొని, వారి విజయాన్ని మీ విజయం లా ఆనందించండి. వారు చాలా బాగా చేయడం కొనసాగాలని వారిని ఆశీర్వదించండి. జీవితం మీరు ఊహించని అపారమైన విజయాన్ని బహుమతిగా మీకు ఇస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th feb 2025 soul sustenance telugu

భగవంతుడు సర్వోన్నతుడైన తండ్రి మరియు తల్లి

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మత సంప్రదాయాలలో, భగవంతుడిని ఎల్లప్పుడూ పురుషుడిగా సూచిస్తారు. కానీ, ఆత్మకు లింగం లేదు, అది పురుష లేదా స్త్రీలింగం కాదు. అలాగే భగవంతుడిని అనగా పరమ ఆత్మ యొక్క లింగం

Read More »
17th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 3)

ప్రతి సంబంధంలో ఆ సంబంధం ఎలా ఉన్నా కూడా ఎదుటి వారిని ముందు ఉంచే వ్యక్తి సంబంధాన్ని నడిపిస్తాడని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిని ముందు ఉంచడం అంటే కొన్ని సమయాల్లో మీరు ఒక నిర్దిష్ట

Read More »
16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »