Hin

8th july 2024 soul sustenance telugu

July 8, 2024

ఇతరులను విమర్శించడం మరియు తీర్పు చెప్పడం నుండి విముక్తి పొందడం

విభిన్న వ్యక్తిత్వాలు, మాటలు మరియు చర్యలు కలిగిన విభిన్న వ్యక్తులతో వ్యవహరించడం సంబంధాలలో చాలా ముఖ్యమైన అంశం. కొన్ని పదాలు మరియు చర్యలు ప్రతికూలంగా ఉండవచ్చు. కొన్ని సానుకూలంగా ఉన్నప్పటికీ మనకు ఇష్టమైన విధంగా లేదా మనం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో, ఇతరులను విమర్శించడం మరియు తీర్పు చెప్పడం చాలా సులభం. కొన్నిసార్లు వారి పట్ల అయిష్టంతో, వారి గురించి ప్రతికూలంగా ఆలోచించడం మరియు మాట్లాడటం కూడా ప్రారంభిస్తాము. మన వ్యక్తిత్వంలోని ఈ ప్రతికూల అంశాన్ని మార్చగలిగేలా మనం ధారణ  చేయాల్సిన కొన్ని లక్షణాలు ఏమిటి?


  1. ఆధ్యాత్మిక ప్రేమ – మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం. ప్రేమ సాగరుడైన పరమాత్ముని సంతానం. పరమాత్ముని వలె మనది ప్రేమ స్వరూపం. కనుక సంబంధాలలో మన అసలైన ప్రేమ స్వరూపాన్ని తీసుకురావడం ప్రారంభించి, అందరినీ ఆధ్యాత్మిక ప్రేమ యొక్క దృష్టితో చూడటం ప్రారంభించినప్పుడు, వారి బలహీనతలు మన స్పృహను తాకవు మరియు వారిని సులభంగా క్షమిస్తాము.
    2. శుభ భావన మరియు శుభకామన – శుభ భావన అంటే ఇతరుల ప్రత్యేకతలు మరియు మంచితనాన్ని చూసినప్పుడు మనకు కలిగే, మనం ప్రసరించే సానుకూల ప్రకంపనలు. శుభకామన అంటే ఇతరుల జీవితంలోని ప్రతి దశలో వారికి మంచి కోరుకుంటూ మనం వారి పట్ల కలిగి ఉండే సానుకూల ఉద్దేశాలు. రెండూ మనల్ని ఇతరులను మరింత అర్థం చేసేకునేలా చేస్తాయి. వారి పట్ల మనం వినయంగా మారి, వారి పట్ల ప్రతికూలత నుండి విముక్తి పొందుతాము.
    3. కృతజ్ఞత – మన కుటుంబంలో, స్నేహితుల సర్కిల్లో లేదా ఆఫీస్ లో మనం వ్యవహరించే వారందరూ ఏదో ఒక సమయంలో మనకు మరియు ఇతరులకు మంచి చేసి ఉంటారు. వారు చేసిన ఆ మంచిని గుర్తుంచుకొని వారి పట్ల కృతజ్ఞతతో ఉండటం వారిని నిరంతరం సానుకూల కోణంలో చూడటానికి మనకు సహాయపడుతుంది.
    4. సహనం – ఇతరుల ప్రతికూలత వల్ల మనం సులభంగా కలత చెందడానికి ప్రధాన కారణాలలో ఒకటి మనకు సహన శక్తి లేకపోవడం. పరమాత్ముని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారా, మెడిటేషన్ లో సహన శక్తికి సాగరుడైన ఆ పరమాత్మునితో కనెక్ట్ అవ్వడం ద్వారా సహనం పెరుగుతుంది. ఇతరులతో సులభంగా సర్దుకొని, వారిని అస్సలు విమర్శించకుండా లేదా తీర్పు చెప్పకుండా ఉండటానికి పరమాత్ముడు మనకు విశాల హృదయంతో ఉండటానికి సహాయపడతాడు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

మనం ఒక పోటీలో ఉన్నామని, జీవితం ప్రతి క్షణం గెలవడం గురించెనని మన రోజువారీ జీవితంలో తరచుగా వింటాము. అలాగే, శారీరక స్థాయిలో ఏదైనా విజయం సాధించినప్పుడు చాలా సంతోషపడటం మనకు అలవాటయింది. అది

Read More »
11th dec 2024 soul sustenance telugu

నిజమైన విజయానికి ప్రాథమిక సూత్రాలు

కొన్నిసార్లు మనం మన లక్ష్యాలను సాధించలేనప్పుడు, మనం అంటాము – నేను విజయవంతం కాలేదు, నేను విఫలమయ్యాను. మిమ్మల్ని మీరు వైఫల్యం అని అనుకుంటే మీకు మీరే అన్యాయం చేసుకోవడం. మిమ్మల్ని మీరు నిజంగానే

Read More »
10th dec 2024 soul sustenance telugu

మనతో మంచిగా లేని వ్యక్తులకు కృతజ్ఞత

కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలు మనకు దాదాపు భరించలేనివిగా అనిపిస్తాయి. వారు మన జీవితంలోకి వచ్చి వారి మాటలు, ప్రవర్తనలతో గందరగోళాన్ని సృష్టించారని మనం భావిస్తాము. అలాంటి వ్యక్తులు మన సామర్థ్యాన్ని బయటకు తీసుకువస్తారని, మనం

Read More »