HI

1st oct 2023 soul sustenance telugu new

October 1, 2023

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు కలియుగం లేదా ఇనుప యుగం. ఆత్మలు శాశ్వతమైనవి కాబట్టి, ఈ నాటకం శాశ్వతమైనది. ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది మరియు ఆత్మలు అనేక జన్మలు తీసుకొని డ్రామాలో తమ తమ పాత్రలను అభినయిస్తారు. అలాగే, ప్రపంచ నాటకంలో అత్యంత అందమైన పాత్రను ఇనుప యుగం చివరిలో భగవంతుడు అభినయిస్తారు. ఇనుప యుగాన్ని స్వర్ణయుగంగా మార్చి, ఆత్మలందిరిని, ప్రకృతిని మళ్లీ పాజిటివ్ మరియు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తితో నింపుతారు, మరియు డ్రామా సరికొత్తగా ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, డ్రామాలో ఏ సమయంలో ఉన్నాం? ప్రపంచ నాటకంలో భగవంతుడు తన పాత్రను అభినయినించి స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్న సమయంలో ఉన్నాము. ఇవి నాలుగు యుగాల  డ్రామా యొక్క చివరి క్షణాలు. ఈ సమయంలో మనం ఏమి చేయాలి?

  1. మనము అంతరంగంలోకి వెళ్లి, మనము చేసిన నాలుగు దశల మన ప్రయాణాన్ని పరిశీలించుకుందాము. భగవంతుడు మనతో పంచుకున్న జ్ఞానం ఆధారంగా మనం ప్రతి దశను విజువలైజ్ చేసుకుందాము. పరంధామానికి తిరిగి వెళ్ళటానికి మరియు పరంధామం నుండి దిగి వచ్చిన తర్వాత కొత్త ప్రయాణానికి సిద్ధం కావడానికి, ఎక్కడైతే ఆత్మ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుందో ఆ సమయం ఆసన్నమైంది. 
  2. మొదటి రెండు దశలలో మన సంస్కారాలు, ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు పాత్రలలో ప్రతిదీ మంచిగా ఉందని మనము భగవంతుడి నుండి నేర్చుకున్నాము. మనము దైహిక ఆకర్షణలు మరియు శారీరక మొహం ప్రభావానికి లోనైనందున మనము తరువాతి రెండు దశలలో వీటన్నింటిలో దిగజారాము. మనం మళ్లీ ఆ తప్పులే చేయకుండా అందమైన, పాజిటివ్ కర్మలను మాత్రమే చేద్దాం.
  3. భగవంతుని ఆత్మిక జ్ఞానాన్ని విని, వారు చెప్పేది అనుభవం చేసుకుందాము. మెడిటేషన్ లో, ఆత్మల శాశ్వత నివాసం – శాంతిధామం లోని పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడిని అనుభవం చేసుకొని వారితో కనెక్ట్ అవుదాం. ఇది ఆత్మను మళ్లీ 100% పవిత్రంగా మారుస్తుంది.
  4. ప్రపంచ నాటకం ప్రయాణంలో ఇది ఒక ముగింపు. మనము ఇప్పుడు తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము, దీనిలో స్వర్ణయుగానికి మరియు ఆ తర్వాత కొరకు కూడా ఆత్మ అన్ని గుణాలు, శక్తులు మరియు అందమైన సంస్కారాలతో నిండి ఉండాలి. ఈ ప్రయాణంలో కాలక్రమంగా పోగొట్టుకున్న వీటన్నింటినీ,  నిరంతరం భగవంతుని సాంగత్యంలో ఉంటూ మళ్లీ మనల్ని మనం నింపుకుందాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd may 2024 soul sustenance telugu

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో

Read More »
22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »