Hin

6th june2024 soul sustenance telugu

June 6, 2024

జీవితం నీకు ఒక పోటీనా?

పోటీ భాష ఎవరు మేలు, ఎవరు నంబర్ వన్? అని అంటుంది. ఇతరులకన్నా మెరుగ్గా ఉండాలని కోరుకోవడం ఎప్పటికీ అంతం లేని పోటీ. కాబట్టి మన ప్రేమ, సంరక్షణ మరియు సహకారం యొక్క శక్తులు నిరోధించబడతాయి. మనలో చాలామంది జీవితం ఒక పోటీ అని నమ్ముతూ పెరిగాము.

  1. పోటీ మీ వృత్తిపరమైన ప్రపంచానికి మాత్రమే పరిమితం కాదు. మీరు మీ కుటుంబంలో కూడా – ఎవరు ఎక్కువ ప్రేమించబడతారు, ఎవరు ఇంటిని బాగా చూసుకుంటారు, ఎవరు ఎక్కువ సంపాదిస్తారు మొదలైన వాటిపై పోటీ పడుతూ ఉండవచ్చు.
  2. పోటీ చేసే మీ ధోరణి అలవాటుగా అవుతుంది. మీరు అవగాహన కోల్పోయి తెలియకుండానే ఇతరుల కంటే ముందుండాలనే ప్రయత్నంలో ఎప్పుడూ భయం, టెన్షన్ మరియు ఆందోళనతో జీవిస్తూ ఉండవచ్చు.
  3. మీరు ఎవరితోనైనా పోటీ చేసినప్పుడు, మీరు నష్టపోతారు. మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా కేవలం ఇతర వ్యక్తి కంటే ముందున్నందుకు సంతోషపడుతూ ఉండవచ్చు. లేదా మీరు మీ సామర్థ్యానికి మించి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ ఒత్తిడికి గురి కావచ్చు. మీరు మీ కోసం సెట్ చేసుకున్న మీ ఉత్తమమైన లక్ష్యం కాకుండా ఇతరుల కంటే మెరుగ్గా ఉండటమే మీ లక్ష్యంగా మారవచ్చు.
  4. పోటీని కాకుండా సహయోగం మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. మీరు ఒకరికొకరు వ్యతిరేకులు కాదు, ఒకరితో ఒకరు కలిసి ఉన్నారు. మీరు పోటీ చేయడం లేదు; మీరు కలిసి ఈ ప్రయాణంలో ఉన్నారు. మీరు ముందుకు సాగుతున్నప్పుడు మీకు తెలిసిన వాటిని మీరు పంచుకుంటూ ఇతరులను తీసుకెళ్తారు. ఈ మార్పు మీ జీవన విధానాన్ని మారుస్తుంది మరియు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని తెస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »
5th october 2024 soul sustenance telugu 1

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక

Read More »