Hin

11th august 2024 soul sustenance telugu

August 11, 2024

జీవితం యొక్క అదృశ్య మద్దతు వ్యవస్థ (పార్ట్ 3)

మన సంబంధాలపై అత్యంత ముఖ్యమైన మరియు ప్రాధమిక ప్రభావం, సంబంధాలను  ప్రేమ, ఆనందంతో నింపేది మన మానసిక స్థితి. మనం ఇతరులతో చాలా సానుకూలంగా మాట్లాడుతాము, చాలా మధురంగా వ్యవహరిస్తాము, కాని మన మనస్సు అసూయ, ప్రతీకారం, ద్వేషం,  అనుమానం మరియు అభద్రత వంటి భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇది మన సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసి అంతర్గతంగా బలహీనపరుస్తుంది. కొన్నిసార్లు ఈ దాచిన భావోద్వేగాల ప్రభావాలు వెంటనే కనిపించవు కానీ అవి మనకు తెలియకుండానే అంతర్గతంగా సంబంధాలను దెబ్బతీస్తూనే ఉంటాయి. కాబట్టి, ఏ మనసైతే ఎల్లప్పుడూ తేలికగా ఉండి, మధురమైన శక్తిని ప్రేమ రూపంగా ప్రసరిస్తుందో,  ఆనందం యొక్క రూపంగా సంతృప్తి మరియు శాంతి యొక్క రూపంగా ప్రశాంతత కలిగి ఉంటుందో, ఆ మనసు అదే శక్తిని తిరిగి పొందుతుంది. ఇది సంబంధాలలో విజయాలు నిండి, విభిన్న వ్యక్తిత్వాలు, దృక్కోణాల నుండి ఉత్పన్నమయ్యే అడ్డంకులు లేకుండా చేస్తుంది.

చివరగా, మనమందరం ఈ ప్రపంచంలో మన జీవితంలో  విభిన్న పాత్రలను పోషిస్తాము. ఒక వ్యక్తి తండ్రి, కొడుకు, భర్త, సోదరుడు, ఇంజనీర్ మొదలైన వివిధ పాత్రలను పోషిస్తారు. ఒకరి జీవితంలో ఈ పాత్రలన్నింటికీ విభిన్న గుణాలు, శక్తులు, నైపుణ్యాలు మరియు వైఖరులు అవసరం. మనస్సు ఎంత ఎక్కువ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుందో మరియు శాంతి, ప్రేమ, ఆనందం యొక్క  ప్రాథమిక ధర్మాల స్వరూపంగా ఉంటాయో, అంత ఎక్కువ స్థిరంగా ఉంటూ సానుకూలంగా ఉంటుంది. ఫలితంగా, సరైన గుణాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని ఆచరణలో కూడా అమలు చేయగలదు. అంతేకాక ,  మనస్సు ఈ మూడు గుణాలతో నిండిన సానుకూల ఆలోచనలతో నిండినప్పుడు తన శక్తిని ఆదా చేస్తూ  ప్రతి పరిస్థితిలోనూ శక్తివంతంగా ఉంటుంది. మనస్సు ఎంత శక్తివంతంగా ఉంటే, అంత సరైన నిర్ణయాలు తీసుకోగలదు, మంచి చెడుల మధ్య సులభంగా వివక్ష చూపగలదు, ఇది విజయానికి ప్రాథమిక కీ. కాబట్టి, మనస్సు ప్రభావంతో పాత్రలు ఎంతో ప్రయోజనం పొందుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 1)

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »