Hin

3rd july 2024 soul sustenance telugu

July 3, 2024

జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆధ్యాత్మిక విజయాన్ని పొందండి (పార్ట్ 1)

జీవితం మనకు వివిధ రకాల పరిస్థితులను అందించినప్పటికీ, జీవితంలో ప్రతి క్షణం సాధించడానికి ఏదో ఒకటి ఉన్నప్పటికీ, మనమందరం అనేక లక్ష్యాలు మరియు విజయాల సాధనలో మన జీవితాలను గడుపుతాము. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని సంతోషంగా, సంతృప్తితో జీవించడమే నిజమైన విజయం. మరోవైపు, ముఖ్యమైన లక్ష్యాలను, ముఖ్యమైన మైలురాళ్లను సాధించడం కూడా చాలా ముఖ్యం. ఈ లక్ష్యాలను, మైలురాళ్లను చేరుకునే ప్రయాణంలో మనం తేలికగా ఉండి, మన చర్యలను సానుకూలంగా, సరైనవిగా ఉంచుకుని సంతోషంగా ఉంటే, అదే వాస్తవానికి నిజమైన విజయం.

తరచుగా, మన లక్ష్యాలను సాధించడానికి వేగంగా ప్రయత్నించినప్పుడు, కొంత విజయాన్ని సాధించవచ్చు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు మీరు ఇతరులకు బాధ కలిగించే చర్యలను చేస్తే లేదా మీరు నిజాయితీగా లేకుంటే లేదా మీరు ఆశను మరియు విశ్వాసాన్ని కోల్పోతే లేదా మీ సంబంధాలు లేదా ఆరోగ్యం ప్రభావితమైతే, అది నిజమైన విజయం కాదు. విజయం అంటే తుది గమ్యాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే కాక ప్రతి దశలో సాధించిన అనుభూతిని పొందడం. అలాగే, విజయం అంటే ఒకరికొకరు శుభాభావనలు పంచుకోవడం, ఒకరినొకరు ప్రేమించడం, ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం, మంచి గుణాలు మరియు శక్తులతో ప్రతి ఒక్కరికీ సేవ చేస్తూ మంచి వ్యక్తిగా ఉండటం. సంపద లేదా భౌతిక విజయం కలిగిన్నపటికీ భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక విజయం  లేకపోవడం సంపూర్ణ 100% విజయం కాదు.

(సశేషం)  

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »