Hin

4th july 2024 soul sustenance telugu

July 4, 2024

జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆధ్యాత్మిక విజయాన్ని పొందండి (పార్ట్ 2)

విజయం అనేది ఒక సానుకూల సంఘటన జరగడం లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం అని తప్పుగా నిర్వచించబడింది. మనం పరీక్షలో బాగా చేశాము లేదా డిగ్రీ వచ్చింది లేదా తీవ్రమైన అనారోగ్యాన్ని అధిగమించాము లేదా పనిలో ఒక ప్రాజెక్ట్ ను పూర్తి చేసాము అని తరచుగా చెబుతాము. మన జీవితంలో ఎప్పుడైనా మంచి జరిగినప్పటికీ ఇవన్నీ బాహ్య సంఘటనలు. విజయం బయటి నుండి వస్తుందని ఎప్పుడూ భావించాము. మరోవైపు, అంతర్గతంగా మీరు శక్తివంతంగా, సంతృప్తిగా, ఆనందంగా, సత్యతతో నిండి ఉంటే మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఎందుకంటే మన అంతర్గత మానసిక స్థితితో పాటు మన తెలివితేటలు, ఇతర ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణాలు మరియు మన శారీరక నైపుణ్యాలు కూడా మనకు విజయాన్ని అందిస్తాయి.

కొన్నిసార్లు మనకు సానుకూల నైపుణ్యాలు మరియు ఒక పనికి సరిపోయే మంచి శారీరక వ్యక్తిత్వం లేకపోయినా మన అంతర్గత మానసిక స్థితి చాలా బాగుండటం వలన మనం ఆ పనిలో బాగా రాణిస్తాము. ఎందుకంటే మీరు కష్టపడి పనిచేయకపోయినా లేదా నైపుణ్యాలను ఉపయోగించకపోయినా, మీ అంతర్గత స్థితి ఆ పనిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు, మనం చాలా ప్రతిభావంతంగా మరియు మంచి మేథోపరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నప్పటికీ,  మన అంతర్గత మానసిక స్థితి కొన్నిసార్లు అంత సానుకూలంగా, స్పష్టంగా మరియు శక్తివంతంగా లేనప్పుడు లేదా మన మనస్సు అనవసరమైన, ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటే ఆ నిర్దిష్ట పనిలో బాగా పని చేయలేము. ఈ సందర్భంలో, అవసరమైన లక్ష్యాన్ని సాధించడానికి నైపుణ్యాలు సరిపోవు. కాబట్టి, బాహ్యంగా మనకు ఉన్న విభిన్న సానుకూల నైపుణ్యాలు, ప్రతిభ కంటే దీర్ఘకాలిక విజయం ఎక్కువగా మన సంకల్పాలు, సానుకూల స్వభావం ద్వారా సాధించబడుతుంది.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »
17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »