Hin

21st April 2025 Soul Sustenance Telugu

April 21, 2025

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని ఎదుర్కునే శక్తిని మరియు సమర్థతను పరీక్షిస్తాయి ఎందుకంటే జీవితంలో అనిశ్చితులు అపారంగా వస్తుంటాయి, జీవితంలో సవాళ్లను ఎప్పుడూ అధిగమిస్తూనే ఉండాలి. మన ప్రస్తుత జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితి అనేది గత జీవితంలో లేదా ఈ జీవితంలో చేసిన తప్పు కర్మ లేదా కర్మలకు సంకేతం. అలాగే, ప్రస్తుత సమయంలో చేసే మంచి కర్మలు గతంలో చేసిన ఈ ప్రతికూల కర్మల ప్రభావాన్ని రద్దు చేసి అవి కలిగించే దుఃఖం లేదా అసంతృప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కర్మలు, చెడు కర్మలు అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ సందేశంలో వీటి అర్థాన్ని తెలుసుకుందాం.

  1. ఆత్మ యొక్క స్వధర్మాలైన శాంతి, సంతోషం, ఆనందం, పవిత్రత, శక్తి మరియు జ్ఞానముల ఆధారంగా చేసే కర్మలను సత్కర్మలు అని అంటాము. ఇందుకు భిన్నంగా, ఈ గుణాల నుండి మన వ్యక్తిత్వాన్ని మరియు సంస్కారాలను దూరంగా తీసుకువెళ్ళే కర్మలను చెడు కర్మలు అని అంటాం. ఉదాహరణకు, ఈరోజు నా సహోద్యోగుడు నాతో చాలా కోపంగా ఉన్న కారణంగా నేను కూడా నా శాంతాన్ని కోల్పోయాను. అతనిపై కోప్పడ్డ తర్వాత నాకెలా అనిపిస్తుంది? శాంతి, ప్రేమ మరియు ఆనందం లోపించినట్లుగా, నా కోపం తెలివిహీనమైనదిగా అనిపిస్తుంది. ఈరోజు నేను గర్వంతో వ్యవహరించి నా మాటల్లో మరియు ప్రవర్తనలో దురభిమానంతో ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను ఎన్నటికీ ఆత్మ శక్తిని అనుభూతి చేయలేను ఎందుకంటే దురభిమానంతో ఉన్న వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అంటే తొందరగా అవమానాన్ని ఫీల్ అవుతాడు. గర్వంతో ఉన్న వ్యక్తి మాటలలో చేదును, విమర్శను ప్రదర్శిస్తూ ప్రేమ మరియు జ్ఞానంలో లోటు కలిగి ఉంటాడు.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »