Hin

22nd April 2025 Soul Sustenance Telugu

April 22, 2025

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

  1.   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత సానుకూలంగా మరియు చక్కగా ఉంటాయో అంత ఎక్కువగా మన జీవితం తేలికగా, సంతోషంగా సాగిపోతుంది. చాలావరకు, ఎవరైతే అసంతోషాన్ని, అసంతృప్తిని పొందుతున్నారో వారు గతంలో చెడు కర్మలు చేసి ఉండవచ్చు, అది ఈ జీవితం కావచ్చు లేక గత జీవితం కావచ్చు. వర్తమానంలో ఎంత ఎక్కువ సత్కర్మలు చేస్తే అంత ఎక్కవుగా ఈ విశ్వంలోకి మంచిని ప్రసరింపజేసేందుకు నిమిత్తమవ్వగలము. ఇదే భగవంతుడు మనకిచ్చిన నిజ ధర్మము, బాధ్యత. నేను నా కోసమే జీవిస్తున్నానా లేక, మంచిగా ఉండు-మంచిని పంచు, సానుకూలంగా ఉండు- సానుకూలతను పంచు అన్న కార్యాన్ని నెరవేరుస్తున్నానా? ఇలా మనల్ని మనమే ప్రశ్నించుకోవటం ముఖ్యం. మంచితనము దాగి ఉండదు, మంచితనాన్ని అందరికీ పంచాలి. సత్కర్మలు చేయడం వలన కలిగే లాభం ఇది. చెడు కర్మలు చేస్తే భగవంతుని దృష్టిలో, మన దృష్టిలో, సమాజం దృష్టిలో మనం గౌరవాన్ని కోల్పోతాము. ఎందుకంటే ఇతరులను మంచి వైపుకు కాక చెడు వైపుకు ప్రేరేపిస్తున్నాము కనుక.
  2.   సత్కర్మలే నిజమైన విశ్వ కర్మలు. ప్రపంచం వయసు ఎక్కువ అయింది. కామము, క్రోధము, మోహము, లోభము, అహంకారము, ఈర్ష్య, ద్వేషము, పగ మరియు ఇతర ప్రతికూల భావోద్వేగాలు అనే మాధ్యమాల ద్వారా ప్రతికూలత ఎక్కువయింది. నిజమైన సత్ పురుషులు మరియు స్త్రీలు ఈ నెగిటివ్ భావోద్వేగాల ప్రభావంలో లేరు. అందుకే, భగవంతుడు మనిషిని తన ప్రతిరూపంగా తయారు చేసాడు అంటారు. ఈ విశ్వంలోని మంచితనము భగవంతుని స్వభావానికి తార్కాణం. నేటి ప్రతికూలత అసురతత్వానికి (రావణుడికి) ప్రతీక, అసురుడు లేక రావణుడు మనలో ఉన్న బలహీనతలకు గుర్తు.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »