Hin

23rd April 2025 Soul Sustenance Telugu

April 23, 2025

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

  1.   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము, ఎప్పుడైనా క్షణం ఆగి, నేను చేసే ఎన్ని కర్మలు మంచివి, ఎన్ని చెడువి అని ఆలోచించారా? ఇలా ఆలోచించడం అవసరం. ఉదాహరణకు, ఈరోజు మీరు మీ ఆఫీసుకు వెళ్ళారు, అక్కడ మీరు ఎంతోమందితో మీ కార్యక్షేత్రంలో కలిసారు. కలిసిన ప్రతి ఒక్కరికీ, ఆలోచనల స్థాయిలో, భావాల స్థాయిలో, మాటలు మరియు కర్మల స్థాయిలో మీరు ఏదో ఒకటి పంచుతారు. కొందరితో మీరు ఎక్కువ సుగుణాలను పంచుకొని ఉండవచ్చు, కొందరితో తటస్థంగా ఉండవచ్చు, మరి కొందరితో మీరు ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ సమయంలో, ప్రతిరోజూ మీ కర్మలను పరిశీలించుకుంటూ భవిష్యత్తు కోసం సవరించుకుంటున్నారా? మొదటగా, మంచి చెడుల జ్ఞానం ఉండటం ముఖ్యం. తర్వాత ఆ జ్ఞానం ఆధారంగా మీ కర్మలు రూపుదిద్దుకుంటాయి. ఇది మనం ప్రతిరోజూ చేయవలసిన హోమ్‌వర్కు ఎందుకంటే మనమందరమూ మన జీవితంలో విద్యార్థులమే, మనకు మనమే టీచరు.

5.    మనమంతా ఆత్మిక బాటసారులం. ఈరోజు మనం చేసే ప్రతి సంస్కారాన్ని రాబోయే జన్మలకు, భవిష్యత్తులోకి తీసుకువెళ్తున్నాం. చేసిన చెడు కర్మలు, చెడు సంస్కారాల ఫలితం అనే బరువైన లగేజీతో ప్రయాణించాలా లేక సత్కర్మలను చేసి వాటి ద్వారా పొందిన ఆశీర్వాదాలు అనే తేలికైన లగేజీతో ప్రయాణించాలా? మన బంధాలను, మన భౌతిక శరీరాన్ని, మన సంపదను, మనం పోషించే పాత్రలను కూడా మనం మన మరుసటి జన్మకు తీసుకువెళ్ళలేము. ఒకసారి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెడితే ఇవన్నీ మారిపోతాయి. మనం చేసే కర్మల ఆధారంగా మనం నింపుకున్న సంస్కారాలే మనతో వస్తాయి. మంచి కర్మలు మనల్ని మంచి సంస్కారాలతో నింపుతాయి, చెడు కర్మలు చెడు సంస్కారాలతో నింపుతాయి. మన సంస్కారాలు మంచివిగా, దివ్యంగా ఉంటే మరుజన్మలో మనకు ఆరోగ్యకరమైన శరీరం, చక్కని బంధాలు, ఎనలేని సంపద మరియు పోషించడానికి చక్కని పాత్రలు లభిస్తాయి.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »