Hin

19th july 2024 soul sustenance telugu

July 19, 2024

జీవితంలోని ప్రతి దృష్టాంతంలో ఓపికగా ఉండటం

వేగం మరియు హడావిడి  మన జీవిత లక్షణాలుగా మారినప్పటి నుండి మనం అసహనంతో ఉన్నాము. సహనం ఫలిస్తుందని, అసహనం బాధిస్తుంది అని జ్ఞానం చెబుతుంది. కానీ కొన్నిసార్లు మనం దేనినైనా వేగవంతం చేయాలనుకున్నప్పుడు, మనకు త్వరిత మార్పులు కావాలనుకున్నప్పుడు, సవాళ్లు ఉన్నప్పుడు లేదా అనిశ్చితిని భరించలేనప్పుడు, మనం అసహనానికి గురవుతాము. మనం కోరుకున్నది మనకు కావాలి, అది వెంటనే కావాలనుకుంటాము.

  1. మీ చుట్టూ ఉన్న ప్రతి విషయంలో ఓపికగా ఉండటానికి, అంగీకరించడానికి మరియు స్వీకరించడానికి మీకు శక్తి ఉంది.”లేదు, నేను వేచి ఉండలేను… నేను సహించలేను….”అని ఎప్పుడూ అనకండి. చిన్న చిన్న సన్నివేశాలలో సహనం కోల్పోవడం అసహనాన్ని మీ వ్యక్తిత్వంలో భాగంగా చేస్తుంది. కష్టాలు మరియు సమస్యలను పరిష్కరించే శక్తిని సహనం మీకు ఇస్తుంది, ఎందుకంటే సమస్యలు పరిష్కరించబడనప్పుడు మీరు అసహనాన్ని సృష్టించి ఆధ్యాత్మిక శక్తిని క్షీణింపచేయలేదు కాబట్టి.
  2. సహనం మీ నిజ స్వభావం. ఇది హూందాతనం, గౌరవం మరియు అంతర్గత బలానికి సంకేతం. ప్రతి ఉదయం ధ్యానం చేసి మిమ్మల్ని మీరు శాంతితో నింపుకోండి. శాంతి ఎల్లప్పుడూ సహనంతో కలిసి ఉంటుంది. పిల్లలు దురుసుగా ప్రవర్తించడం, ట్రాఫిక్ జామ్, ఇంటర్నెట్ మందగించడం, సహచరులు ఆలస్యంగా రావడం లేదా ఎవరైనా గడువును కోల్పోవడం- వంటి సమయంలో సహనంతో, ఓపికగా ఉండండి. ఇది మీ ఆలోచనలను మీ నియంత్రణలోకి తెస్తుంది.
  3. స్వయం పట్ల, ఇతర వ్యక్తుల పట్ల మరియు పరిస్థితుల పట్ల కూడా ఓపికగా ఉండండి. కొందరు నెమ్మదిగా ఉండవచ్చు, కొందరు తప్పులు చేయవచ్చు, కానీ వారందరూ తమ వంతు కృషి చేస్తున్నారు. వారికి గౌరవంతో సలహా ఇవ్వండి లేదా బోధించండి. మీ సౌలభ్యం యొక్క ప్రకంపనలు వారు అభివృద్ధి చెందడానికి ఓదార్పు శక్తిని ప్రసరింపజేస్తాయి. అలాగే, మన సహనం యొక్క ప్రకంపనలను నిరంతరం స్వీకరించినప్పుడు అన్ని రకాల ప్రతికూల పరిస్థితులు వేగంగా పరిష్కరించబడతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 1)

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 1) మీ ప్రతిరోజును ప్రకాశవంతంగా ప్రారంభించడానికి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో దిన చర్యను సెట్ చేసుకోవాలి. దానితో పాటు, మనస్సు మరియు బుద్ధి

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరులను క్షమించడం మనకు కష్టమవుతుంది. క్షమాపణ మాత్రమే ప్రతికూలతను కరిగించడానికి సహాయపడుతుందని మనం గుర్తుంచుకుంటే, అది జీవితంలో

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »