Hin

19th march 2025 soul sustenance telugu

March 19, 2025

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన లక్ష్యాలకు మధ్య అనేక అడ్డంకులు తలెత్తుతాయి. జీవితంలోని ఏ రంగంలోనైనా, లక్ష్యాన్ని చేరుకోవడానికి లేదా మనకు కావలసిన ఫలితాలను సాధించడానికి తగినంతగా ప్రయత్నించే బదులు, మనం సాకులు చెబుతూ కొన్నిసార్లు దానిని సాధించేందుకు మిగిలిన చర్యలను తప్పించుకునే ప్రయత్నం చేస్తాం.

 

  1. మీ జీవితంలో సాకులు చెప్పడానికి సాధారణ కారణాలపై ఆత్మపరిశీలన చేయండి – మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్లలేకపోవడం, అనిశ్చితత యొక్క భయం, వైఫల్య భయం, ప్రేరణ లేకపోవడం లేదా క్రమశిక్షణ లేకపోవడం. సమయం, వనరులు, నైపుణ్యాలు లేకపోవడం లేదా బాహ్య కారకాలను నిందించడం వంటి సాకులు ఉండవచ్చు.

 

  1. ప్రేరణ లేదా పట్టుదల లేకపోవడం వల్ల వచ్చే సాకులు మీ ఆరోగ్యం, సంబంధాలు లేదా వృత్తిలో మీరు ఆశించినది ఎల్లప్పుడూ సాధించకపోవడానికి ఒక పెద్ద కారణం. అవి మీ అంతర్గత శక్తిని తగ్గించి, మీ సామర్థ్యానికి తగినంతగా పని చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి.

 

  1. సాకులతో చెప్పడం అనేది మీ స్వంత జీవితానికి బాధ్యత వహించడం ద్వారా మీరు మార్చుకోగల అలవాటు. స్పష్టమైన ఆంతరిక మరియు బాహ్య లక్ష్యాలను నిర్దేశించుకోండి. అడ్డంకులు, జాప్యాలు లేదా మీరు తప్పులు చేస్తే, వాటి గురించి చింతించకండి. అవి మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ప్రశాంతంగా ఉంటూ ఓర్పు వహించండి.

 

  1. జీవితంలో మంచి ఆధ్యాత్మిక సంబంధంతో మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి. ప్రతిరోజూ మీ ప్రణాళికను ఉదయం ధృవీకరించండి. ఆ ప్రణాళికను పరిపూర్ణంగా అనుసరించడాన్ని విజువలైజ్ చేసుకోండి. మీకు మరియు మీ పనులకు సరైన శక్తిని ప్రసరింపచేయడానికి ప్రతి గంటకు ఇలా చేయండి.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »