Hin

24th june 2025 soul sustenance telugu

June 24, 2025

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 1)

మనమందరం మనం చేసే ప్రతి పనిలో బాగా చేయాలనే సానుకూల ఉద్దేశ్యంతో మన జీవితాలను గడుపుతున్నాము, అందుకు మన రోజంతా జీవితంలోని వివిధ రంగాలలో విభిన్న చర్యలను చేస్తూ గడుపుతాము. మన చర్యలన్నీ మనకు అనేక రకాలుగా ముఖ్యమైనవి. మనం వాటిలో విజయవంతం కావాలంటే మన మనస్సు ప్రేరణతో మరియు బలంతో నిండి ఉండాలి. అలాగే, మనలో ఎంతటి ప్రేరణ ఉండాలంటే మన కుటుంబ సభ్యులు మరియు మన జీవితంలోని ఇతరులు కూడా అదే శక్తిని తమ సంకల్పాలలో ఉంచాలనే ప్రేరణ పొందాలి. జీవితంలో విజయాన్ని అనుభూతి చేయడానికి మన ప్రేరణ స్థాయిలను పెంచే 5 మార్గాలను ఈ సందేశంలో అన్వేషిద్దాం – 

మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు దానిని కోల్పోకండి 

ఆధ్యాత్మికత మనకు నాలుగు విశ్వాసాలను కలిగి ఉండాలని బోధిస్తుంది – మనపై విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, భగవంతుడు అందించే ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం మరియు ఇతరులపై విశ్వాసం.  మొదటి విశ్వాసం అనగా మనపై మనకు ఉన్న విశ్వాసం అంటే, విజయవంతం కావడానికి మనకు సామర్థ్యాలు మరియు శక్తులు ఉన్నాయని నమ్మకం కలిగి ఉండటం. అలాగే, ఏదైనా ప్రతికూల పరిస్థితి గురించి సానుకూలంగా ఆలోచిస్తే అది ఏదో ఒక రూపంలో మనకు సానుకూలంగా మారుతుందని మన సానుకూలతపై విశ్వాసం కలిగి ఉండాలి. మనపై విశ్వాసం అంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ మన ప్రయోజనం కోసమే అని మరియు మన నిజాయితీ మనల్ని ఏ ప్రతికూల దిశలో వెళ్ళనివ్వదని లేదా మరో మాటలో చెప్పాలంటే మన జీవితం మన స్వంత అంతర్గత బలం ద్వారా రక్షించబడుతుందనే విశ్వాసం. మనలో మనపై ఉన్న విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? ఆధ్యాత్మికత  మన లోలోపలికి చూసుకునే శక్తిని నేర్పుతుంది, ఇది జీవితం యొక్క భౌతిక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆధునిక భౌతికవాద జీవనశైలిలో మనం ఎక్కువగా బయట విషయాలపై దృష్టి పెడతాం. మనం లోలోపలికి చూసుకున్నప్పుడు, మన గురించి మనం మరింత అవగాహనలో ఉండి, మన అంతర్గత గొప్పతనాన్ని కనుగొని, సానుకూల ఆత్మగౌరవాన్ని అనుభూతి చేస్తాము. అలాగే, గతంలోని  విజయాలను సానుకూలంగా చూసి గతంలో జరిగిన విఫలతలకు మనసు అట్టిపడకుండా, వాటిపై నెగటివ్ భావనలు కలిగి ఉండకుండా ఉండటం నేర్చుకుంటాం. ఇది మనకు ప్రేరణనిస్తుంది, మనల్ని మరింత ఏకాగ్రతతో, దృఢనిశ్చయంతో ఉంచుతుంది మరియు మనపై మన విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మనపై మనకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే, మనం అంతగా ప్రేరేపించబడతాము మరియు ఆ ప్రేరణ మన చర్యలన్నింటినీ నడిపిస్తుంది.

(సశేషం)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »