Hin

25th june 2025 soul sustenance telugu

June 25, 2025

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు భగవంతుని జ్ఞానంలోని ప్రేరణాత్మక వాక్యాలను చదవండి

మనం రోజంతా వేర్వేరు సమయాల్లో అనేక రకాల జ్ఞానాన్ని చదువుతాము మరియు వింటాము. అవి జీవితంలోని వివిధ భౌతిక కోణాల గురించి మనకు సమాచారాన్ని అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో సమాచారం మనకు ముఖ్యమైనది, కానీ కొన్ని సార్లు మనం దానిని ఎలాంటి ప్రత్యేకమైన అవసరం లేకుండానే గ్రహిస్తాం – అంటే అది అవసరంలేని మరియు అతిగా ఉండే సమాచారం అని అర్ధం. మన మనస్సు సమాచారం గురించి ఆలోచిస్తుంది మరియు మన బుద్ది దానిని దృశ్యమానం చేయడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు ఈ జ్ఞానం మన మానసిక మరియు భావోద్వేగ శక్తిని కూడా తగ్గిస్తుంది, ఇది మన ప్రేరణ స్థాయిలను తగ్గించి మానసికంగా మరియు భావోద్వేగపరంగా అలసిపోయేలా చేస్తుంది. ఈ సమాచారం అంతా మనలోకి తీసుకుంటూ పోతే, రోజు ముగిసే సమయానికి మనలో బయటి విజయాల కోసం అవసరమైన అంతర్గత శక్తి మరియు సానుకూల ఉత్సాహం మిగలవు. మరొకవైపు, భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక అంశాల గురించి ఉంటుంది, అది మనకు శక్తినిస్తుంది. ప్రతిరోజూ భగవంతుని జ్ఞానం యొక్క కొన్ని ప్రేరణాత్మక వాక్యాలను చదవడం కూడా చాలా ప్రేరణ కలిగిస్తుంది. ఈ ప్రేరణ శక్తి మన చర్యలలో ప్రవహించి మనల్ని బలంగా, మరింత సానుకూలంగా చేస్తుంది. ఇది మనల్ని సులభంగా విజయవంతం చేస్తుంది. మనం స్వీకరించే ప్రతికూల మరియు మితిమీరిన సమాచారం మన విజయాన్ని తగ్గిస్తుంది.

 

మీరు చేస్తున్న పనిని ఆనందించండి 

చాలామందిలో ఒక సాధారణ అలవాటు ఏమిటంటే – వారు ఒక పని చేయడం ప్రారంభించేటప్పుడు చాలా పాజిటివ్ అవగాహనతో మొదలుపెడతారు. కానీ ఆ పని మధ్యలో ఉన్నప్పుడు వారి ప్రేరణ తక్కువవుతుంది. ఈ సమస్యకు ఒక కారణం ఏమిటంటే – వారు రోజులో చేసే విభిన్న పనులను ఆనందంగా చేయడం లేదు. కొంతమంది ఇంటి పనులు, ఉదాహరణకు వంట చేయడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడం, పిల్లలను పెంచడం వంటి విషయాలను అలసటగా లేదా బోరుగా అనుకుంటారు. ఇంకొంతమంది కార్యాలయ పనులు, షాపింగ్ చేయడం, డబ్బుతో సంబంధమైన పనులను పునరావృతంగా లేదా కష్టంగా అనుకుంటారు మరియు అలాంటి పనులపై త్వరగా ఆసక్తిని కోల్పోతారు. మీరు ఏదైనా ఒక పనిని ఆనందంగా చేయనంతవరకు, దాన్ని పూర్తి ఉత్సాహంతో మరియు అలసట లేకుండా చేయాలనే ప్రేరణ మీరు పొందలేరు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే – మీరు మీతోనే మాట్లాడుకుంటూ, మీరు ఆ పనులు చేస్తుండగా ప్రేరణ ఎందుకు కోల్పోతున్నారు అనే కారణాలను తెలుసుకొని, వాటికి పరిష్కారాలు కనుగొనాలి. అలాగే, ప్రస్తుతం మీరు చేస్తున్న విధానాన్ని మార్చి కొత్తగా ప్రయత్నించవచ్చు లేదా ఆ పనులలో కొన్నికొన్ని కొత్త అంశాలను చేర్చవచ్చు, తద్వారా అవి మరింత ఆసక్తికరంగా మారతాయి. ఉదాహరణకు, వంట చేస్తూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక సంగీతం లేదా ఆధ్యాత్మిక పాటలు వినడం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. లేదా ఇంటి పనులలో పిల్లలను కూడా చేర్చి వాటిని ఆనందంగా మార్చవచ్చు – దీని ద్వారా వారు కూడా నేర్చుకుంటారు.

(సశేషం)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »